Monkeypox: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వ్యాధి ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి కూడా మంకీపాక్స్ అటాక్ అవుతోంది. తాజాగా దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. కేరళలో మంకీపాక్స్ లక్షణాలతో మరణించిన కొద్ది రోజుల తర్వాత, యూఏఈ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించడంతో మంకీపాక్స్ నిర్ధారణైంది. ఇప్పటివరకు కేరళ రాష్ట్రంలో ఐదో మంకీపాక్స్ కేసు ఇది. కేరళలో మరో మంకీపాక్స్ కేసు వార్తలను కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ధ్రువీకరించారు. 30 ఏళ్ల రోగి ప్రస్తుతం మలప్పురంలో చికిత్స పొందుతున్నాడని ఆరోగ్య మంత్రి తెలిపారు.
యూఏఈ నుంచి జూలై 27న కోజికోడ్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన మలప్పురంలోని మంజేరి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో మంకీపాక్స్ లాంటి లక్షణాలతో ఒక వ్యక్తి మరణించిన తరువాత 20 మందిని నిర్బంధించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. బాధిత కుటుంబసభ్యులు, స్నేహితులతో సహా కేవలం 10 మందితో ఆ వ్యక్తి సన్నిహితంగా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. పరిస్థితి అదుపులో ఉందని.. ప్రస్తుతానికి ఎలాంటి భయాందోళనలు లేవని వైద్యారోగ్య స్టాండింగ్ కమిటీ సభ్యురాలు రెంజిని వెల్లడించారు. మంకీపాక్స్ లక్షణాలతో మరణించిన వ్యక్తి కుటుంబసభ్యులు, స్నేహితులతో సలహా కేవలం 10 మందితో మాత్రమే ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడని తెలిపారు. ఇప్పటివరకు 20 మందిని నిర్భందించినట్లు ఆమె పేర్కొన్నారు.
మంకీపాక్స్ అనేది మంకీపాక్స్ వైరస్ వల్ల కలిగే జూనోటిక్ వ్యాధి. ఇది మశూచికి కారణమయ్యే అదే వైరస్‌ల కుటుంబానికి చెందినది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధి పశ్చిమ, మధ్య ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇటీవల, స్థానికేతర దేశాల నుండి కూడా కేసులు నమోదయ్యాయి.మంకీపాక్స్ సాధారణ లక్షణాలు జ్వరం, దద్దుర్లు, శోషరస కణుపుల వాపుతో పాటు అనేక రకాల వైద్యపరమైన సమస్యలకు దారితీయవచ్చు. ఇది సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాల పాటు ఉండే వ్యాధి. సరైన చికిత్స తీసుకుంటే తగ్గే అవకాశం ఉంది. కొత్తగా కేసులు నమోదవుతుండడంతో పరిస్థితిని పర్యవేక్షించడానికి, ప్రతిస్పందన కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం సోమవారం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
Heath Davis: మాజీ స్టార్ క్రికెటర్ సంచలన ప్రకటన.. అవును.. నేను ‘గే’..!!
ఇవాళ ఢిల్లీలో ఓ నైజీరియన్ జాతీయుడికి ఈ వ్యాధి సోకిన సంగతి తెలిసిందే. 35 ఏళ్ల నైజీరియన్ గత ఐదు రోజులుగా శరీరంపై దద్దర్లు, జ్వరం రావడంతో ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రిలో చేరాడు. బాధితుడి శాంపిళ్లను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపారు. తాజాగా సోమవారం వచ్చిన రిపోర్టులో అతనికి పాజిటివ్ గా తేలింది. మరో ఇద్దరు ఆఫ్రికన్ జాతీయులు కూడా మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ నమోదైన ఈ రెండు కేసులతో కలిపి దేశంలో మొత్తం 7 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయి.