Pakistan Army Helicopter: పాకిస్తాన్‌లో వాయువ్య ప్రావిన్స్‌లోని బలూచిస్థాన్‌లో సోమవారం రాత్రి అదృశ్యమైన పాకిస్తాన్ ఆర్మీ హెలికాప్టర్.. లాస్బెలా జిల్లాలోని మూసా గోత్ సమీపంలో కుప్పకూలినట్లు పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం మంగళవారం తెలిపింది. ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకారం, ప్రతికూల వాతావరణం కారణంగా జరిగిన ప్రమాదంలో లెఫ్టినెంట్ జనరల్ సర్ఫరాజ్ అలీతో సహా విమానంలో ఉన్న ఆరుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు.మూసా గోత్, విందార్, లాస్బెలాలో వరద సహాయక చర్యలలో ఉండగా జరిగిన ఈ దురదృష్టకర ఘటన జరిగినట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్(డీజీ) వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ సర్ఫరాజ్ అలీతో సహా మొత్తం 6 మంది అధికారులు మరణించారని తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం సంభవించిందని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. పాక్ ఆర్మీ జవాన్ల మృతి పట్ల దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. వరద బాధితులకు సాయమందిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా విచారం వ్యక్తం చేశారు.
Russia on Pelosi Taiwan Visit : “పూర్తిగా రెచ్చగొట్టే చర్య”.. చైనాకు వంతపాడుతున్న రష్యా!
బలూచిస్థాన్‌లోని లాస్బెలాలో వరద సహాయక చర్యల్లో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ అదృశ్యమైనట్లు నిన్న రాత్రి పాకిస్థాన్ సైన్యం ధ్రువీకరించింది. బలూచిస్థాన్‌లో జరుగుతున్న వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న XII కార్ప్స్ కమాండర్ జనరల్ సర్ఫరాజ్ అలీ, ఇతర ఐదుగురు సీనియర్ సైనిక అధికారులు హెలికాప్టర్‌లో ఉన్నారని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. బలూచిస్థాన్‌లోని లాస్బెలాలో వరద సహాయక చర్యలలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ ఏటీసీతో సంబంధాలు కోల్పోయిందని వెల్లడించింది. బలూచిస్తాన్‌లో వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న 12 కార్ప్స్ కమాండర్‌తో సహా ఆరుగురు వ్యక్తులు విమానంలో ఉన్నారు.