కామన్వెల్త్ గేమ్స్-2022లో చివరి రోజు భారత్ పతకాల పంట పండించింది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో సింధు స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా పురుషుల డబుల్స్ విభాగంలోనూ భారత్ మరో స్వర్ణం అందుకుంది
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందే ముగిశాయి. పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఆగస్టు 12న సమావేశాలు ముగియాల్సి ఉన్నప్పటికీ.. అంతకన్నా ముందే ఈ రోజే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
సభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని సభ్యులకు సూచించడంతో పాటు తన అనుభవాలను పంచుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాజ్యసభలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ హోదాలో చివరి ప్రసంగం చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం వేములపల్లిలో ఓ దారుణం జరిగింది. ఓ నాలుగేళ్ల చిన్నారిపై కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. వేములపల్లిలోని రామకృష్ణ పౌల్ట్రీఫారంలో రమణ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత టేబుల్ టెన్నిస్ సంచలనం సత్యన్ జ్ఞానశేఖరన్‌కు ఈ కామన్వెల్త్ గేమ్స్ గుర్తుండిపోతుంది. టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారత క్రీడాకారుడు సత్యన్ జ్ఞానశేఖరన్ కాంస్యాన్ని సాధించాడు.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ బంగారు పతకాన్ని సాధించాడు.
వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న ఈ తీవ్ర అల్పపీడనం.. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2022 (జేఈఈ మెయిన్స్ 2022) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు ప్రకటించింది. ర్యాంకులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆదివారం కేవలం ప్రొవిజనల్ ఫైనల్ కీ మాత్రమే విడుదల చేసిన ఎన్టీఏ ఇవాళ ర్యాంకులను ప్రకటించింది. జులై 25-30 మధ్య ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు వారి ఫలితాలను చూసుకోవచ్చు.
పత్రాచల్ ల్యాండ్ కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఆగస్టు 22 వరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పత్రాచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో ఆగస్టు 1వ తేదీన సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.
కామన్వెల్త్ క్రీడలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ్టితో ఆ క్రీడలు ముగియనుండగా.. భారత క్రీడాకారులు మాత్రం అదరగొడుతున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణం సాధించింది.కెనడాకు చెందిన మిచెల్ లీతో మహిళల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.