Common Wealth Games 2022: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత టేబుల్ టెన్నిస్ సంచలనం సత్యన్ జ్ఞానశేఖరన్‌కు ఈ కామన్వెల్త్ గేమ్స్ గుర్తుండిపోతుంది. టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారత క్రీడాకారుడు సత్యన్ జ్ఞానశేఖరన్ కాంస్యాన్ని సాధించాడు. పతక నిర్ణయాత్మక గేమ్‌లో సత్యన్ ఇంగ్లండ్‌కు చెందిన పాల్ డ్రింక్‌హాల్‌ను ఓడించి కాంస్యాన్ని గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 4-3 తేడాతో పాల్‌ను ఓడించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో ఇది సత్యన్‌కు మూడో పతకం.
Common Wealth Games 2022: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. లక్ష్యాన్ని ఛేదించిన లక్ష్యసేన్
అతను గతంలో బంగారు పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల జట్టులో భాగంగా ఉన్నాడు. అతను తన భాగస్వామి వెటరన్ భారత పాడ్లర్ శరత్ కమల్‌తో కలిసి పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో రజత పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. ఈ పతకంతో భారత ఖాతాలో 58 పతకాలు (20 స్వర్ణాలు, 15 రజతాలు, 23 కాంస్యాలు) ఉన్నాయి. అంతకుముందు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే.