atrocious Incident: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అభం శుభం తెలియని చిన్నారులపై కొన్ని మానవ మృగాలు అత్యాచారాలకు కూడా ఒడిగడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ దారుణ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం వేములపల్లిలో జరిగింది. ఓ నాలుగేళ్ల చిన్నారిపై కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. వేములపల్లిలోని రామకృష్ణ పౌల్ట్రీఫారంలో రమణ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. రమణ చేస్తున్న పౌల్ట్రీఫారంలోనే సదరు చిన్నారి అమ్మమ్మ తాతయ్యలు కూడా పనిచేస్తున్నారు.
Billionaire in One Minute: నిమిషంలోనే బిలియనీర్.. యువకుడి ఖాతాలోకి రూ.6,833 కోట్లు
చిన్నారి అమ్మమ్మ తాతయ్యలు పనిచేసుకుంటుండగా.. ఆ చిన్నారి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటోంది. ఇది గమనించిన రమణ ఆ చిన్నారిని పౌల్ట్రీఫారంలోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో చిన్నారిని మండపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఆ దుండగుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు మండిపడ్డారు.