మణిపూర్‌లో ప్రభుత్వం 5 రోజుల పాటు మొబైల్ డేటా సేవలను నిలిపివేసింది. మణిపూర్ అంతటా మొబైల్ డేటా సేవలను ఐదు రోజుల పాటు నిలిపివేసినట్లు ప్రత్యేక కార్యదర్శి (హోమ్) హెచ్ జ్ఞాన్ ప్రకాష్ శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు.
ఈ రక్షా బంధన్‌కు మీ సోదరికి ఎలాంటి బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా?. మీరు మీ సోదరికి ఏదైనా బహుమతిగా ఇవ్వాలని చూస్తున్నట్లయితే.. ఈ బహుమతులను వారు ఇష్టపడడమే కాకుండా చాలా ఉపయోగకరంగానూ ఉంట రక్షాబంధన్ కోసం మీ తోబుట్టువులు ఇష్టపడే కొన్ని బహుమతుల జాబితా ఇక్కడ ఉంది. అయితే మీ కోసం కొన్ని బహుమతులను తెలియజేస్తున్నాం. అవేంటో చూడండి
అమెరికాలో గన్‌కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా డేటన్‌కు ఉత్తరాన ఉన్న ఒహియోలోని బట్లర్ టౌన్‌షిప్‌లో మరో సారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ భారత పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్ చరిత్ర సృష్టించింది. పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ 3-5తో స్వర్ణ పతకం సాధించింది.
ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు భారత్ 40 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇందులో 13 స్వర్ణాలు, 11రజతాలు, 16 కాంస్య పతకాలు భారత్‌కు లభించాయి.
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరగనుంది. సంస్థ ఛైర్మన్, ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ భేటీలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారు.
రాకెట్ల దాడితో ప్రతీకారం తీర్చుకున్న పాలస్తీనా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ బాంబు దాడులను విస్తరించడంతో గాజాలో వాతావరణం హింసాత్మకంగా మారింది. పాలస్తీనా ఉద్యమం ఇస్లామిక్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ బ్రేకింగ్ డాన్ కింద గాజా స్ట్రిప్‌ను లక్ష్యంగా చేసుకున్న వైమానిక దాడుల కారణంగా 24 మంది మరణించగా.. మరో 203 మంది గాయపడ్డారు.
క్యూబాలోని మతాంజాస్ నగరంలోని చమురు నిల్వ కేంద్రంలో పిడుగు పడింది. ఈ పిడుగుపాటు వల్ల భారీగా మంటలు చెలరేగడంతో దాదాపు 80 మంది గాయపడ్డారు. మంటలార్పేందుకు వచ్చిన 17 మంది అగ్నిమాపక సిబ్బంది అదృశ్యమయ్యారు.
సాధారణంగా ప్రజలపై ఎవరైనా దౌర్జన్యం చేస్తే పోలీస్ స్టేషన్‌కు పరిగెడతారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు మొరపెట్టుకుంటారు. కానీ పోలీసులపైనే దౌర్జన్యం జరిగితే.. ఇక ప్రజల పరిస్థితి ఏంటి?. న్యూ ఢిల్లీలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఈ అనుమానాలను రేకెత్తిస్తుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి.