పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో బస్సు-కారు ఢీకొన్న ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు మరణించారు. ప్రభుత్వ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఘటనాస్థలికి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. బీర్భూమ్ జిల్లాలోని మల్లార్‌పూర్‌లోని రోడ్డు నంబర్ 14లో మంగళవారం సాయంత్రం ప్రభుత్వ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్‌గా కార్యకర్తల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నారా లోకేష్.. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించారు. చిన్న చిన్న సమస్యలకీ ఆస్పత్రుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు ఖర్చు చేయలేని నిరుపేదలు, నియోజకవర్గంలో గ్రామీణుల కోసం మొదటిసారిగా `సంజీవని ఆరోగ్య రథం` పేరుతో మొబైల్ ఆస్పత్రి ఆలోచనకి కార్యరూపం ఇచ్చారు.
సరళతర వ్యాపార నిర్వహణ( ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డు లభించింది. మీసేవ పోర్టల్, వ్యాపార నిర్వహణలో అత్యుత్తమ విధానాలు అమలుచేస్తున్నందుకు ఈ పురస్కారం తెలంగాణను వరించింది.
నితీష్ కుమార్ ఎత్తుగడతో బిహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయినట్లు అయింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామమక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు నితీష్. బిహార్ ముఖ్యమంత్రిగా 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం గమనార్హం.
బిహార్ రాజకీయాల్లో మరోసారి కీలక మలుపు చోటుచేసుకుంది. బీజేపీకి రెండోసారి షాక్ ఇస్తూ ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చేసింది. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో చేతులు కలిపింది. ఆ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఏర్పాటు చేయనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తులు గతంతో పోలిస్తే భారీగానే పెరిగాయి. ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో ఎక్కవ భాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. అయితే, ఎలాంటి స్థిరాస్తులు లేవు. గాంధీనగర్‌లో గతంలో కొనుగోలు చేసిన భూమిని మోడీ విరాళంగా ఇచ్చేశారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజీనామాను సమర్పించడంతో పాటు బీజేపీతో పొత్తును కూడా రద్దు చేసుకున్నారు. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) మాజీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మధ్యంతర ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో ఆయన కేవలం 43 సీట్లకు తగ్గారని.. వచ్చేసారి సున్నా గెలుస్తారని విమర్శించారు. నితీష్‌కు విశ్వసనీయత సున్నా అంటూ విమర్శలు గుప్పించారు.
తెలుగు తేజం, కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణ విజేత పీవీ సింధు విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2022 చివరి రోజున భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుతం చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
Bihar Political Crisis: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌కు ఒంటరిగా వచ్చిన ఆయన గవర్నర్ ఫాగు చౌహాన్‌తో భేటీ అయ్యారు. అనంతరం గవర్నర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. బిహార్ గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన తర్వాత ఎన్‌డీఏ నుండి వైదొలగాలని ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని నితీష్ కుమార్ వెల్లడించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఎన్డీయేకు గుడ్‌బై చెప్పాలని నితీశ్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా […]
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ దాడులు నిర్వహించింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ఆయన నివాసంపై సోదాలు జరిపింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తన ఇంట్లోకి అధికారులు బలవంతంగా చొరబడ్డారని, ఇలాంటి దాడులు వెనకబడిన దేశాల్లోనే జరుగుతాయని ధ్వజమెత్తారు.