నాగాలాండ్‌లోని నోక్లక్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున అస్సాం రైఫిల్స్ జవాన్లపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇండో-మయన్మార్ సరిహద్దులో ఉన్న డాన్ పాంగ్షా ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదులు, అస్సాం రైఫిల్స్ సిబ్బంది మధ్య కాల్పులు జరిగినట్లు నోక్లక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ హియాజు మేరు తెలిపారు.
బిహార్‌లో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా చకచకా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలిసి, రాజీనామా లేఖ అందిస్తారని తెలిసింది. మరోవైపు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జేడీయూ అధిష్ఠానం పాట్నాలో నిర్వహించిన సమావేశం కీలక చర్చలకు వేదికైనట్లు తెలిసింది.
గస్ట్ 27 నుంచి యూఏఈలో జరగనున్న ఆసియా కప్ కోసం భారత జట్టును సోమవారం ప్రకటించారు. రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. ప్రీమియర్ పేస్‌మెన్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.
లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను కేవలం జనాభా ప్రాతిపదికన చేయడం వలన ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ తీవ్రంగా నష్టపోతాయని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో రియలా..? ఫేకా..? అనేది తేలాకే చర్యలుంటాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అరగంటలోనో.. గంటలోనో రిపోర్ట్ వస్తుందని టీడీపీ అంటోందని.. కానీ రిపోర్టు ఇంకా రాలేదని.. విచారణ జరుగుతోందన్నారు. కొన్నాళ్లు ఆగితే కొంపలేం మునిగిపోవన్నారు.
వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని.. త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు టూలెట్ బోర్డు ఖాయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అప్పులు, కేసులపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై లేదని మండిపడ్డారు. విశ్వవ్యాప్తంగా తెలుగువారి పరువు తీసిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోకుండా తెదేపాపై నోరు పారేసుకోవడం వైకాపా నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. రజనీకాంత్ నేడు తమిళనాడు గవర్నర్‌తో సమావేశం కావడమే. ఈ నేపథ్యంలో రజనీ మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 14 మంది మంత్రులుగా ఉండే అవకాశం ఉందని, మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. భవన నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తయ్యిందని తెలిపారు. జోన్ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో మరోసారి ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి. పట్టపగలు గ్రామాల్లో సంచరిస్తూ ఎలుగుబంట్లు స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం చినవంకలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి.