Assam Rifles: నాగాలాండ్‌లోని నోక్లక్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున అస్సాం రైఫిల్స్ జవాన్లపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇండో-మయన్మార్ సరిహద్దులో ఉన్న డాన్ పాంగ్షా ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదులు, అస్సాం రైఫిల్స్ సిబ్బంది మధ్య కాల్పులు జరిగినట్లు నోక్లక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ హియాజు మేరు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. “ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక లేదు. ఈ ప్రాంతం చాలా మారుమూల ప్రాంతం, మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్య కూడా ఉంది” అని మేరు చెప్పారు.
Commonwealth Games 2002: గేమ్స్ కోసం వెళ్లి.. మాయమైన 10 మంది లంక అథ్లెట్లు
ఈరోజు తెల్లవారుజామున, అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరప్ చాంగ్లాంగ్‌లోని జెన్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ సిబ్బందిపై ఇలాంటి కాల్పుల ఘటన జరిగింది. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవం కోసం అధిక నిఘా దృష్ట్యా దళాలు మెరుగైన పెట్రోలింగ్ కార్యకలాపాలను చేపడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జేసీవో) చేతికి చిన్న గాయమైంది. ఈశాన్య భారత్‌లోని పలు రాష్ట్రాల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని ఉల్ఫా-ఐ పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ చీఫ్ పరేష్ బారువా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశాడు. ఇతర గాయాలు లేదా నష్టం ఇప్పటివరకు నివేదించబడలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.