Bears Hulchul: ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో మరోసారి ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి. పట్టపగలు గ్రామాల్లో సంచరిస్తూ ఎలుగుబంట్లు స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం చినవంకలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి. ఇటీవల వజ్రపుకొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు దాడిలో ముగ్గురు మృతి చెందారు. మళ్ళీ ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో అక్కడ ప్రజలు హడలిపోతున్నారు. అటవీశాఖ అధికారులు త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వాపోతున్నారు.
Loan App Recovery : మరో లోన్‌యాప్ ఏజెంట్ కీచక పర్వం.. న్యూడ్ ఫోటోలు పెట్టి
గతంలో కూడా చాలా మంది ఎలుగుబంట్ల దాడిలో గాయపడడంతో పాటు కొంతమంది చనిపోయారని… కొంతమందికి తీవ్రగాయాలు అయ్యాయని స్థానికులు వాపోతున్నారు. ఎలుగుబంట్లకు భయపడుతూ జీవిస్తున్నామని.. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.