Asia Cup: ఆగస్ట్ 27 నుంచి యూఏఈలో జరగనున్న ఆసియా కప్ కోసం భారత జట్టును సోమవారం ప్రకటించారు. రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. ప్రీమియర్ పేస్‌మెన్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. కేఎల్ రాహుల్ గాయం, కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వైస్ కెప్టెన్‌గా భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. 15 మందితో కూడిన జట్టులో రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ ఇద్దరు వికెట్ కీపింగ్ కోసం ఎంపికయ్యారు. ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్‌లు జట్టులో ఉన్నారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉన్నారు. దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు బ్యాటర్లు జట్టుకు ఎంపికయ్యారు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ఈ టోర్నీకి దూరం కాగా పేస్ అటాక్‌కు అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహిస్తాడు. యువకులు అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ జట్టులో ఉన్నారు.
జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల కారణంగా ఆసియా కప్ జట్టులో లేరని బీసీసీఐ వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్‌లను స్టాండ్‌బైలుగా నియమించినట్లు ప్రకటించింది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ హర్షల్ పటేల్ కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. ఆసియా కప్ ఆగస్టు 27న ప్రారంభం కానుంది. 28న భారత్ తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. సెప్టెంబర్ 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Common wealth Games 2022: ఆఖరి రోజు భారత్‌కు పతకాల పంట.. ఖాతాలో 61 పతకాలు
ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా , రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్