Bihar Politics: బిహార్‌లో దోస్తీపై అవగాహనకు వచ్చిన జేడీయూ-ఆర్జేడీ.. డిప్యూటీ సీఎంగా తేజస్వి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: బిహార్‌లో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా చకచకా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలిసి, రాజీనామా లేఖ అందిస్తారని తెలిసింది. మరోవైపు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జేడీయూ అధిష్ఠానం పాట్నాలో నిర్వహించిన సమావేశం కీలక చర్చలకు వేదికైనట్లు తెలిసింది. “పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ నితీశ్ కుమార్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని స్పష్టం చేశారు.” అని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. సరికొత్త కూటమికి నేతృత్వం వహించేందుకు సిద్ధమైన నితీశ్‌కు శుభాకాంక్షలు అంటూ జేడీయూ జాతీయ పార్లమెంటరీ బోర్డ్ అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా ట్వీట్ చేశారు . అదే సమయంలో.. ఆర్జేడీ నేతలు సైతం ఇలాంటి తీర్మానమే చేశారు. పాట్నాలో సమావేశమైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తాజా రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. నిర్ణయం తీసుకునే అధికారాన్ని తేజస్వీ యాదవ్‌కు అప్పగించారు. కాంగ్రెస్, వామపక్షాల నేతలు సైతం.. తేజస్వీకి అండగా ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రం సహా సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాల్ని లాలూ నిశితంగా గమనిస్తున్నారని.. అయితే రాజకీయ నిర్ణయాలన్నీ పూర్తి స్థాయిలో తేజస్వీనే తీసుకుంటున్నారని ఆర్జేడీ వర్గాలు తెలిపాయి.
Bihar Political Crisis: బీజేపీకి నితీష్ కుమార్ గుడ్ బై.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం
Also Read
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నితీష్ కుమార్‌కు మద్దతు ఇచ్చేందుకు తేజస్వి యాదవ్ అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ విడిపోయిన చోటే మహాగటబంధన్ 2.0 ప్రారంభమవుతుందని ఆర్జేడీ పార్టీ వర్గాలు సూచించాయి. తేజస్వి యాదవ్ నితీశ్ కుమార్ మంత్రివర్గం డిప్యూటీ సీఎంగా, అతని అన్నయ్య తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రివర్గంలో ఉంటారని రాజకీయ వర్గాలు తెలిపాయి. ఇవాళ మధ్యాహ్నం జరిగిన తన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో నితీశ్ కుమార్ బీజేపీతో విడిపోయినట్లు ప్రకటించారు. ఇవాళ సాయంత్రం వరకు గవర్నర్‌ను కలవనున్నారు. ఈ సమావేశంలో తేజస్వి యాదవ్‌తో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్న ఇతర నేతలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి