బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మహాకూటమిలో భాగమైన వివిధ పార్టీల నుంచి మంగళవారం బిహార్ కేబినెట్‌లోకి మొత్తం 31 మంది మంత్రులుగా చేరారు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రయాణీకుల వెళ్తున్న బస్సు, చమురు ట్యాంకర్ ఎదురెదురగా ఢీకొన్న ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను ఫిఫా సస్పెండ్ చేయడంపై బుధవారం నాడు తక్షణ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానంలో ప్రస్తావించారు.
చైనాకు చెందిన గూఢచారి నౌక శ్రీలంకలోని హంబన్‌టోటా నౌకాశ్రయానికి మంగళవారం చేరుకుంది. ఈ గూఢచారి నౌక రాకపై భారత్ భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే శ్రీలంకలోని పోర్టుకు చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాలిబన్ పాలన మొదలై సోమవారానికి ఏడాది పూర్తైనా ప్రపంచ దేశాలు మాత్రం వారిని అధికారికంగా గుర్తించకపోవడంతో ఇంకా ఏకాకిగానే మిగిలిపోయింది. ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తైన సందర్భంగా సెలవు దినంగా ప్రకటించారు.
దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. సోమవారం 14,917 కేసులు రాగా.. తాజాగా 8,813 మందికి కొవిడ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు తాజాగా 29 మంది కరోనా బారినపడి చనిపోయారు.