Suriya – Jyotika: ఆమె లేకపోతే పెళ్లే వద్దన్నాడు.. సూర్య లవ్ స్టోరీలో అసలు నిజాలు చెప్పిన తండ్రి శివకుమార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ప్రపంచంలో మోస్ట్ బ్యూటి కపుల్ ఎవరంటే అందరూ సూర్య-జ్యోతిక పేరే చెబుతారు. కోలీవుడ్ వెండితెరపై ‘పూవెల్లం కేట్టుప్పార్’ చిత్రంతో మొదలైన వీరి ప్రయాణం, కేవలం రీల్ లైఫ్‌కే పరిమితం కాకుండా, రియల్ లైఫ్ లోనూ ఒక అద్భుతమైన ప్రేమకావ్యంగా నిలిచిపోయింది. ముంబై నుంచి వచ్చిన పంజాబీ అమ్మాయి జ్యోతిక, క్రమశిక్షణకు మారుపేరైన తమిళ నటుడు శివకుమార్ తనయుడు సూర్య.. భాషలు, సంస్కృతులు వేరైనా మనసులు కలవడంతో ఒకటయ్యారు. 2006లో వివాహం చేసుకున్న ఈ జంట, నేటికీ అన్యోన్యంగా ఉంటూ సినీ పరిశ్రమలో ‘మోస్ట్ ఐకానిక్ కపుల్’గా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే, వీరిద్దరి పెళ్లి వెనుక ఒక పెద్ద సినిమా డ్రామానే జరిగిందని సూర్య తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read: Varanasi: మహేష్ ‘వారణాసి’ కోసం రాజమౌళి కొత్త స్ట్రాటజీ..!
Also Read
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
సూర్య తన ప్రేమ విషయం చెప్పినప్పుడు శివకుమార్ మొదట అస్సలు ఒప్పుకోలేదట. కానీ సూర్య మాత్రం “పెళ్లంటూ చేసుకుంటే జ్యోతికనే చేసుకుంటాను, లేదంటే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను” అని తెగేసి చెప్పాడట. కొడుకు పట్టుదల చూసి శివకుమార్ ఆలోచనలో పడ్డారు. “నేను నా కెరీర్‌లో 150కి పైగా ప్రేమకథా చిత్రాల్లో నటించాను. సినిమాల్లో ప్రేమ గెలవాలని కోరుకునే నేను, నా కొడుకు ప్రేమ విషయంలో ఎందుకు అడ్డుపడాలి?” అని అనిపించిందట. అంతేకాకుండా, జ్యోతిక రాకతో సూర్యలో చాలా సానుకూల మార్పులు వచ్చాయని ఆయన గమనించారు. ఒకప్పుడు చాలా బిడియంగా, మౌనంగా ఉండే సూర్య.. ఇప్పుడు బాధ్యతాయుతమైన భర్తగా, ఇద్దరు పిల్లలకు తండ్రిగా ఎంతో పరిణతి చెందారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 2006లో వివాహం చేసుకున్న ఈ జంట, ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!