Chinese Spy Ship: శ్రీలంక చేరిన చైనా నిఘా నౌక.. భారత్ హెచ్చరికలు బేఖాతరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinese Spy Ship: చైనాకు చెందిన గూఢచారి నౌక శ్రీలంకలోని హంబన్‌టోటా నౌకాశ్రయానికి మంగళవారం చేరుకుంది. ఈ గూఢచారి నౌక రాకపై భారత్ భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే శ్రీలంకలోని పోర్టుకు చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నౌకకు ఉపగ్రహాలు, ఖండాంతర క్షిపణులను ట్రాక్ చేయగల సామర్థ్యం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనా నౌక వాంగ్ యాంగ్ 5 ఉదయం 8.30 గంటలకు శ్రీలంక నౌకాశ్రయానికి చేరుకుందని హార్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డి సిల్వా తెలిపారు.
భారత్‌కు చెందిన వ్యవస్థలపై నిఘావేసే ప్రమాదం ఉందని రక్షణ శాఖ పేర్కొంది. భారతదేశం ఆందోళనల మధ్య ఈ స్పై షిప్ రాకను వాయిదా వేయాలని చైనాను శ్రీలంక గతంలో కోరింది. కానీ చైనా ఒత్తిడికి తలొగ్గి శ్రీలంక శనివారం అనుమతులు జారీ చేసింది. ఆగస్టు 16 నుంచి 22 మధ్య నౌక తమ పోర్టులో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఓడ శ్రీలంక జలాల్లో ఉన్నప్పుడు దాని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ స్విచ్ ఆన్‌లో ఉంచుకోవాలనే షరతుపై ఓడరేవు వద్ద ఉంచడానికి అనుమతించబడిందని శ్రీలంక వెల్లడించింది.
Also Read
- Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
- Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
- Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
- F-16 Fighter Jet Crash: అమెరికాలో F-16 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియో వైరల్, దర్యాప్తు షురూ
Afghanistan: తాలిబన్ పాలనకు ఏడాది.. ఎటు చూసినా రోదనే..
శ్రీలంకపై ఒత్తిడి పెంచేందుకు భద్రతాపరమైన అంశాలను లేవనెత్తటం పూర్తిగా అసంబద్ధమని చైనా పేర్కొంది. చైనా సముద్ర శాస్త్ర పరిశోధన కార్యకలాపాలను హేతుబద్ధమైన కోణంలో చూడాలని, చైనా, శ్రీలంక మధ్య సహకారానికి అంతరాయం కలిగించకుండా ఆపాలని సంబంధిత పక్షాలను కోరుతున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు.
తాజావార్తలు
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
-
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!