Atal Bihari Vajpayee: రాజకీయ దురంధరుడు వాజ్‌పేయ్ వర్ధంతి.. ప్రముఖుల నివాళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atal Bihari Vajpayee: భారత మాజీ ప్రధాని, దివంగత నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయ్ వర్ధంతి(ఆగస్టు 16) సందర్భంగా ఢిల్లీలో ప్రముఖులు నివాళులర్పించారు. వాజ్‌పేయి స్మారక కేంద్రం అటల్ సదైవ్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, ప్రధాని మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ తదితరులతో పాటు వాజ్‌పేయి దత్తత కూతురు నమితా కౌల్ భట్టాచార్య సైతం ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. వాజ్‌పేయి సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆలోచనలు, మాటలు ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటాయన్నారు. దేశ అభివృద్ధికి అటల్‌జీ చేసిన సేవలను మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలన్నారు.
Delhi | President Droupadi Murmu pays floral tribute to former Prime Minister #AtalBihariVajpayee on his death anniversary, at Sadaiv Atal. pic.twitter.com/WPAkfMrHP1
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
— ANI (@ANI) August 16, 2022
Delhi | Vice President Jagdeep Dhankhar pays floral tribute to former Prime Minister #AtalBihariVajpayee on his death anniversary, at Sadaiv Atal. pic.twitter.com/dFCfKSMyAQ
— ANI (@ANI) August 16, 2022
వాజ్‌పేయ్ తన ముక్కుసూటి నిర్ణయాలతో రాజకీయ దురంధరుడిగా భారత రాజకీయాల్లో ఓ చెరగని ముద్ర వేశారు. రాజనీతిజ్ఞుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్న అతికొద్ది మందిలో ఈయనొకరు. సాహితి లోకానికి కవిగా, దాదాపు ఆరేళ్లపాటు భారత దేశానికి ప్రధానిగా, బీజేపీ కీలకనేతగా, అశేష జనాదరణ ఉన్న ప్రముఖుడిగా వాజ్‌పేయ్ గుర్తింపు పొందారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays floral tribute to former Prime Minister #AtalBihariVajpayee on his death anniversary, at Sadaiv Atal. pic.twitter.com/FKBbnrhjbe
— ANI (@ANI) August 16, 2022
Former President Ram Nath Kovind, Lok Sabha Speaker Om Birla, and BJP national president JP Nadda pay floral tributes to former Prime Minister #AtalBihariVajpayee on his death anniversary, at Sadaiv Atal. pic.twitter.com/cb15bTk7Ld
— ANI (@ANI) August 16, 2022
భారత ప్రధానిగా సేవలందించిన అటల్ బిహారీ వాజ్‌పేయి 93 ఏళ్ల వయసులో గతేడాది ఆగస్టు 16న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వాజ్‌పేయి 1996-2004 మధ్య మూడుసార్లు దేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. దాదాపు 47 ఏళ్లపాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగిన వాజపేయి 10 పర్యాయాలు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పోఖ్రాన్ అణు పరీక్ష, కార్గిల్ యుద్ధం, ఢిల్లీ-లాహోర్ బస్సుయాత్ర లాంటి నిర్ణయాలతో ఆయన దేశచరిత్రలో చెరగని ముద్రవేశారు. సుపరిపాలన, ఉన్నతమైన వ్యక్తిత్వంతో వాజ్‌పేయ్ రాజకీయాలకు అతీతంగా అభిమానాన్ని సంపాదించుకున్నారు. బీజేపీనే కాకుండా ఇతర పార్టీల నాయకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ‘రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ’ అంటూ కమ్యూనిస్టులు సైతం వాజ్‌పేయిని కీర్తించారు.
తాజావార్తలు
-
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!