Bus Falls into Riverbed: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 39 మంది సిబ్బందితో వెళ్తున్న బస్సు నదిలో పడటంతో ఆరుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్‌లోని ఫ్రిస్లాన్ చందన్వారి రోడ్డు ప్రాంతంలో భద్రతా బలగాల వాహనం ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది. బస్సు బ్రేకులు ఫెయిలవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది భద్రతా సిబ్బంది గాయాలపాలైనట్లు సమాచారం. వారిని అధికారులు ఆసుపత్రికి తరలిస్తున్నారు.
Bus-Tanker Accident: బస్సు- ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో 20 మంది సజీవ దహనం
ఆ బస్సులో 37 మంది ఐటీబీపీ జవాన్లు ఉండగా.. మరో ఇద్దరు కశ్మీర్ పోలీసులు అని తెలిసింది. చందన్‌వారి నుంచి పహల్‌గామ్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే బస్సులోని జవాన్లంతా అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన విధులు నిర్వర్తించి తిరిగి వస్తున్నారని ఐటీబీపీ అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ఓ అధికారి తెలిపారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైన్యం, స్థానిక పోలీసులతో చేసిన గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్‌నాథ్ యాత్ర జూన్ 29న జమ్మూ నుండి ప్రారంభమైంది. హిమాలయాల ఎగువ భాగంలో ఉన్న 3,880 మీటర్ల ఎత్తైన శివుని గుహ పుణ్యక్షేత్రానికి అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం తీర్థయాత్ర పహల్గాం, బల్తాల్ జంట మార్గాల నుండి జరుగుతుంది.