భద్రాచలం నియోజకవర్గంలో ముంపు గురైన ప్రాంతాలను, నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ముంపు ప్రాంతాల్ని సందర్శించలేదని, వారికి సహాయం అందించలేదని మండిపడ్డారు.
జమ్మూలోని సిధ్రా ప్రాంతంలోని ఒకే ఇంట్లో ఆరుగురు విగత జీవులుగా కనిపించడం కలకలం రేపింది. ఓ ఇంటిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
భారీగా కురుస్తున్న వర్షాల వల్ల తెలుగురాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ప్రాజెక్టులకు ఇంకా వరద కొనసాగుతోంది. గోదావరి, కృష్ణతో పాటు వాటి ఉపనదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉరకలెత్తుతున్న వాగుల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా.. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండగా.. రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ఎన్నికలు జరుగుతాయని పార్టీ ప్రకటించింది, అయితే అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ రాహుల్ గాంధీ ఇప్పటి వరకు వైఖరిని క్లియర్ చేయలేదు.
జనగామ జిల్లా కేంద్రంలోని హనుమకొండ రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియా గురుద్వార్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. అంబేద్కర్ నగర్‌కు చెందిన పగడాల సందీప్ అనే వ్యక్తి ఫకీర్ సురేష్‌ను కత్తితో మెడ కోసి హత్య చేశాడు.
ఎగువన కురిసిన వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. బుధవారం ఉదయం 54.3 అడుగులకు చేరుకుంది. అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులు దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 14,92,679 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.
గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్ల కూల్చివేతకు ముందు, నిర్మాణాన్ని కూల్చివేసే పనిలో ఉన్న ఎడిఫైస్ ఇంజినీరింగ్‌తో పనిచేస్తున్న ఇంజనీర్లు, సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
తాగునీటి కుండను తాకినందుకు టీచర్ తీవ్రంగా కొట్టడం వల్ల ఓ దళిత బాలుడు మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. రాజస్థాన్‌లోని బరన్ మునిసిపల్ కౌన్సిల్‌లోని 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు మంగళవారం తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు పంపారు.
టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. మరోసారి జియో ఫోన్ 5జీతో వినియోగదారులకు చేరువయ్యేందుకు సిద్ధమైంది.