Covid Cases: దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. సోమవారం 14,917 కేసులు రాగా.. తాజాగా 8,813 మందికి కొవిడ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు తాజాగా 29 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్ నుంచి తాజాగా 15,040 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.56 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.15 శాతానికి తగ్గింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు దేశంలో మరో 2,12,129 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
New Pensions In Telangana: హైదరాబాద్‌లో భారీగా కొత్త ఆసరా పింఛన్లు.. ఎంత మందికి అంటే?
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,27,098 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,11,252 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో మొత్తం కేసులు 4,42,77,194కి చేరగా.. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,36,38,844 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 6,10,863 మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 208.31 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,01,547 మంది వైరస్ బారినపడగా.. మరో 1,224 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 59,59,01,236కు చేరింది. ఇప్పటివరకు మహమ్మారి కారణంగా 64,56,460 మంది మరణించారు.
I