Amitabh Choudhary: బీసీసీఐ మాజీ తాత్కాలిక కార్యదర్శి, జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్‌సీఏ) మాజీ అధ్యక్షుడు అమితాబ్ చౌదరి(62) మంగళవారం గుండెపోటుతో మరణించారు. అమితాబ్ చౌదరి స్వస్థలం ఝార్ఖండ్‌లోని రాంచీ. కాగా అశోక్‌నగర్‌లో ఉన్న తన నివాసంలో అమితాబ్ మంగళవారం ఉదయం అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటు రావడంతోనే అమితాబ్ మరణించినట్లు సదరు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
అమితాబ్ చౌదరి ఒక దశాబ్దానికి పైగా జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం బీసీసీఐ సంయుక్త కార్యదర్శిగా ఎదిగారు. ఆ తర్వాత ఒకానొక సమయంలో తాత్కాలిక కార్యదర్శిగా కూడా సేవలందించారు. రెండేళ్ల క్రితం జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జార్ఖండ్ క్రికెట్‌కు రాంచీని ప్రధాన కార్యాలయంగా మార్చడంలో చౌదరి కీలక పాత్ర పోషించారు. 2005-06లో జింబాబ్వేలో భారత జట్టు మేనేజర్‌గా పనిచేశారు.
Bus-Tanker Accident: బస్సు- ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో 20 మంది సజీవ దహనం
అమితాబ్ చౌదరి ఆకస్మిక మృతి పట్ల ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారి అయిన ఆయన రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఆయన అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.