Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షబీభత్సం.. కూలిపోయిన చక్కి వంతెన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాంగ్రా జిల్లాలో ఉన్న చక్కి వంతెన శనివారం కూలిపోయిందని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ తెలియజేశారు. ఈ ఉదయం రాష్ట్రంలోని మండి జిల్లాలో తెల్లవారుజామున ఆకస్మిక వరదలు సంభవించాయి. దీనివల్ల ఇళ్లు, దుకాణాల్లోకి నీరు ప్రవేశించింది. రహదారిపై ఆపి ఉంచిన ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని బాల్, సదర్, తునాగ్, మండి, లమథాచ్‌లోని ప్రదేశాలను ఈ వరదలు ప్రభావితం చేశాయని హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ బులెటిన్ పేర్కొంది.
మండిలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సూచనల దృష్ట్యా మండి జిల్లాలోని కాలేజీలు, ఐటీఐ మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఆగస్టు 20న మూసివేశారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ అరిందం చౌదరి శుక్రవారం సాయంత్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం రాష్ట్రంలోని మండి ప్రాంతంలో మేఘావృతం కాగా.. కొండచరియలు విరిగిపడ్డాయి.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Mumbai: దేశ ఆర్థిక రాజధానికి బెదిరింపులు.. ఉగ్రదాడులు చేస్తామని పాక్ నుంచి సందేశం
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా, చంబా, బిలాస్‌పూర్, సిర్మౌర్, మండి జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రతికూల వాతావరణంలో నదులు, వాగుల దగ్గరకు వెళ్లవద్దని స్థానికులు, పర్యాటకులకు సూచించబడింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు 25 వరకు భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.
#WATCH | Himachal Pradesh: The railway bridge on Chakki river in Himachal Pradesh's Kangra district damaged due to flash flood, and collapsed today morning. The water in the river is yet to recede: Northern Railways pic.twitter.com/ApmVkwAkB8
— ANI (@ANI) August 20, 2022
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!