Somalia Hotel Attack: సోమాలియా రాజధాని మొగదిషులోని హయత్ హోటల్‌పై అల్-షబాబ్ ఉగ్రవాదులు దాడి చేశారు. సుమారు 30 గంటలపాటు కొనసాగిన అల్-షబాబ్ జిహాదీల ఘోరమైన ముట్టడిని సోమాలియా దళాలు ముగించాయని శనివారం అర్ధరాత్రి భద్రతా కమాండర్ మీడియాతో వెల్లడించారు. “భద్రతా దళాలు ఇప్పుడు ముట్టడిని ముగించాయి. ముష్కరులు చనిపోయారు, గత గంటలో భవనం నుంచి ఎటువంటి కాల్పులు జరగలేదు” అని కమాండర్ అక్కడ పరిస్థితిని వివరించారు. భవనంలో ఇంకా పేలుడు పదార్ధాలు అమర్చబడి ఉంటే వాటిని తొలగించాల్సి ఉందని ఆయన తెలిపారు.
అల్-షబాబ్ ఉగ్రవాదుల దాడిలో 40 మందికి పైగా మరణించగా.. 70 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు ప్రభుత్వ దళాలు చేపట్టిన దాడులను గ్రూపు తిప్పికొట్టిందని అల్-షబాబ్ ప్రతినిధి అబ్దియాసిస్ అబు ముసాబ్ తెలిపారు. సోమాలియా కొత్త అధ్యక్షుడు హసన్ షేక్ మొహముద్ జూన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొగదిషులో జరిగిన అతిపెద్ద దాడి ఇది. 1991లో సియాద్ బారే నియంతృత్వ పతనంతో సోమాలియా ఏకీకృత దేశంగా మారింది. అంతర్జాతీయ సమాజం ఫెడరల్ ప్రభుత్వాన్ని మాత్రమే చట్టబద్ధమైనదిగా అధికారికంగా గుర్తించింది. అల్-ఖైదా తీవ్రవాద గ్రూపుతో అనుబంధంగా ఉన్న అల్-షబాబ్, సోమాలియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తోంది. ఇప్పటికీ దేశంలోని దక్షిణ మధ్య భాగాలలో పెద్ద ప్రాంతాలను అల్-షబాబ్ నియంత్రిస్తోంది.
ఈ దాడికి అల్‌ఖైదా అనుబంధ సంస్థ అల్-షాబాద్ ఇస్లామిక్ మిలిటెంట్స్ బాధ్యత వహించింది. ప్రభుత్వ అధికారులు తరచూ సందర్శించే ప్రదేశాలపై దాడులు జరపాలన్నదే తమ ఉద్దేశమని తెలిపింది. మరోవైపు ఆ దాడిని యూఎస్ ఎంబసీ ఖండించింది. ఆగస్టు 14న సోమాలియాలో ఇటీవల అమెరికా జరిపిన వైమానిక దాడిలో 13 మంది అల్-షబాబ్ ఉగ్రవాదులు హతమయ్యారు. మొగదిషులోని ప్రముఖ హోటల్‌పై ఉగ్రవాదుల దాడిని అంతర్జాతీయ సమాజం శనివారం ఖండించింది.
Mumbai Threat Case: ముంబై ఉగ్ర బెదిరింపుల కేసు.. ఒకరు అరెస్ట్
“గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని యూఎన్ కోరుకుంటుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సోమాలిస్ అందరికీ సంఘీభావం తెలియజేస్తుంది” అని సోమాలియాలోని యూఎన్ ప్రతినిధి తెలిపారు. హయత్ హోటల్‌పై జరిగిన పిరికి దాడిని ఈయూ తీవ్రంగా ఖండించింది. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటించింది.
మొగదిషులోని హయత్ హోటల్‌పై దాడిని భారత్ కూడా తీవ్ర పదజాలంతో ఖండించింది. బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని కూడా తెలియజేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో సోమాలియా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చింది.”మొగదిషులోని హయత్ హోటల్‌పై దాడిని భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ పిరికిపంద ఉగ్రవాద చర్యలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుంది. ఉగ్రవాదంపై పోరాటంలో సోమాలియా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా నిలుస్తుంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.