Alpina బ్రాండ్‌కు BMW కిరాక్ లుక్.. కొత్త లోగోతో లగ్జరీ మార్కెట్‌లో దూకుడు
- BMW ఆధీనంలో ఆల్పినా..
- ఆల్పినా బ్రాండ్‌కు కొత్త లుక్ ఇచ్చిన BMW..
- లగ్జరీ మార్కెట్‌లో కొత్త లోగోతో ఎంట్రీ ఇవ్వనున్న ఆల్పినా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Alpina Logo: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW తన సబ్-బ్రాండ్ Alpinaకు కొత్త లోగోను పరిచయం చేసింది. 2026 ప్రారంభంలో ఆల్పినాపై పూర్తిస్థాయి యాజమాన్యం హక్కులను పొందిన తరువాత ఈ మార్పులు చేపట్టింది. ఇకపై ఆల్పినా, సాధారణ BMW మోడళ్లకు, అత్యంత లగ్జరీ బ్రాండ్ అయిన Rolls-Royce మధ్య ప్రత్యేక స్థానం పొందనుంది.
Read Also: Alpha Movie: అలియా-బాబీ గొడవతో ‘ఆల్ఫా’కు కోట్లల్లో నష్టం!
Also Read
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
- TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
- రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
కొత్త ఆల్పినా లోగో:
ఇప్పటి వరకు ఎరుపు, నీలం, నలుపు, తెలుపు రంగుల మిశ్రమంతో ఉన్న ఆల్పినా లోగోను ఇప్పుడు సరళంగా మార్చేసింది. కొత్త లోగోలో బయట వలయంలో “ALPINA” అనే పదాన్ని BMW కార్పొరేట్ ఫాంట్‌లో వ్రాశారు. లోపల థ్రాటిల్ బాడీ, క్రాంక్‌షాఫ్ట్ గుర్తులను సింపుల్‌గా చూపించారు. ఇది బ్రాండ్‌ను మరింత ప్రీమియంగా చూపించేలా రూపొందించారు.
ఉత్పత్తిలో మార్పులు:
ఇకపై ఆల్పినా కార్లు పూర్తిగా BMW ఫ్యాక్టరీలలోనే తయారవుతాయి. ఇంతకుముందు ఉత్పత్తి ప్రక్రియలో కొంత భాగం బుచ్‌లో (Buchloe) వర్క్‌షాప్‌లో కొనసాగేది. ఇప్పుడు ఆ కేంద్రం సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్, ఆల్పినా వారసత్వాన్ని కాపాడే కేంద్రంగా కొనసాగనుంది.
Read Also: బైక్ లవర్స్కి గుడ్న్యూస్.. ఏకంగా, రూ.1 లక్ష డిస్కౌంట్‌తో Honda CB750 Hornet..
ప్రత్యేక స్టైల్:
లోగో మారినా, ఆల్పినా ప్రత్యేకతలు మాత్రం అలాగే ఉంటాయి. ఐకానిక్ నీలం-ఆకుపచ్చ పెయింట్ స్కీమ్, 20-స్పోక్ అలాయ్ వీల్స్ కొనసాగుతాయి. అంతర్గతంగా సాధారణ BMW కంటే మెరుగైన మెటీరియల్స్, అధిక కస్టమైజేషన్ ఎంపికలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
కొత్త బ్రాండింగ్‌తో మొదటి BMW ఆల్పినా మోడల్ కారు ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆల్పినా స్థాపక కుటుంబం అయిన Bovensiepen కంపెనీ ఇటాలియన్ డిజైన్ సంస్థ Zagatoతో కలిసి 603 హార్స్‌పవర్ శక్తి గల గ్రాండ్ టూరర్ కారును రూపొందించింది. ఇది BMW M4 ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైంది. మొత్తానికి, ఆల్పినాను మరింత లగ్జరీ సెగ్మెంట్‌లో నిలబెట్టేందుకు BMW ఈ కీలక మార్పులు చేసినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?