Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్రదాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్‌కు ఒక మెసేజ్ వచ్చింది. 26/11 తరహా తీవ్రవాద దాడి గురించి హెచ్చరించే బెదిరింపు సందేశం పాక్ ఆధారిత ఫోన్ నంబర్ నుండి ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్‌కు పంపబడినట్లు పోలీసులు వెల్లడించారు. భారత్‌లో ఆరుగురు ప్లాన్‌ను అమలు చేస్తారని బెదిరింపు సందేశంలో పేర్కొంది.
Drink More Alcohol: మద్యం తాగండి ప్లీజ్.. సర్కార్ రిక్వెస్ట్..!
ఈ సందేశం పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందేశం రాగానే పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ముంబయిలో ప్రతి ప్రదేశంలో సోదాలు జరిపే అవకాశం ఉంది.