మహారాష్ట్ర తీరంలోని ఓ పాడుపడిన పడవలో మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు, పత్రాలు లభ్యం కావడం కలకలం రేపింది. తీరానికి కొట్టుకొచ్చిన ఆ బోటులో ఏకే-47 తుపాకులు లభ్యం కావడంతో ఉగ్రకోణంలో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.
తన రాజీనామాను డిమాండ్ చేస్తూ భారీ నిరసనల మధ్య జులైలో ద్వీపం దేశం శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన భార్య, కొడుకుతో కలిసి అమెరికాలో స్థిరపడాలని చూస్తున్నట్లు సమాచారం.
బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించారు. ప్రసిద్ధ హిందూ పండుగ జన్మాష్టమిని జరుపుకోవడానికి తాను తన భార్యతో కలిసి ఆలయాన్ని సందర్శించినట్లు ఓ చిత్రాన్ని రిషి సునాక్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
సీబీఐ దాడుల విషయాన్ని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ధ్రువీకరించారు. తన నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం 12,608 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 15,754 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇటీవల క్రమంగా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా.. ఇప్పుడు తగ్గుతున్న జనాభా వృద్ధి రేటులో ఆందోళన చెందుతోంది. శ్రామిక శక్తి తగ్గి.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే ప్రమాదముందని భయాందోళనకు గురవుతోంది. ఈ క్రమంలోనే జనాభా పెంపు కోసం బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది.
CBI: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించింది. ఎక్సైజ్ పాలసీ వివాదంపై ఆయన నివాసంపై సీబీఐ దాడులు చేసింది. దేశ రాజధానిలోని 20 ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, మనీష్ సిసోడియా తన ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ, విచారణకు సహకరిస్తానని ట్వీట్ చేశారు. సిసోడియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ పరిణామాన్ని ధృవీకరించారు. “సీబీఐ వచ్చింది. వారిని స్వాగతిస్తున్నాం. మేము చాలా […]
దాదాపు రెండు దశాబ్దాలుగా కనిపించకుండా పోయిన బిహార్ మాజీ శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) రంజన్ తివారీని గురువారం భారత్-నేపాల్ సరిహద్దు సమీపంలోని రాక్సాల్‌లో అరెస్టు చేశారు.
బ్రిటన్ ప్రధాని రేసులో బోరిస్ జాన్సన్ ఉండి ఉంటే ఆయనకే మళ్లీ పీఠం దక్కి ఉండేదని 'స్కై న్యూస్' కోసం నిర్వహించిన యూగస్ సర్వేలో తేలింది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో ఎక్కువ మంది బోరిస్‌నే కోరుకుంటున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది.