పత్రాచల్ భూ కుంభకోణానికి సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు సెప్టెంబరు 19 వరకు పొడిగిస్తూ ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్‌ఎ) కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేయాలని, రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లను ఉపయోగించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో పది మంది మృతిచెందారు. ఈ పేలుడులో ఇద్దరు రష్యా రాయబార కార్యాలయ సిబ్బంది మరణించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 8 మంది గాయపడినట్లు సమాచారం.
జార్ఖండ్‌లో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సర్కారు నెగ్గింది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వెంటనే సభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని హేమంత్ సోరెన్ ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై కాసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్‌లో సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
మధ్యప్రదేశ్ సర్కారు చేపట్టిన పోషకాహార పథకంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. స్కూల్ పిల్లల ఆహార పథకంలో భారీగా గోల్‌మాల్ జరిగింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యవేక్షణలో ఉన్న మహిళా, శిశు అభివృద్ధి శాఖలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ గుర్తించింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ పర్యటన మత సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నమేనని జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్(లలన్ సింగ్) ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 40 పార్లమెంటు స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో వివాహం తర్వాత వధువుకు నిర్వహించిన కన్యత్వ పరీక్షలో విఫలమవడంతో అత్తమామలు ఆమెను విడిచిపెట్టారు. ఇది చాలదన్నట్లుగా, వారు ఈ విషయంలో పంచాయతీ కూడా పిలిచారు. అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల జరిమానా విధించారు.
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు.
కమ్యూనిస్టుల త్యాగాలు చాలా గొప్పవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ బ్రిటీశ్ వాళ్లకు తొత్తులుగా వ్యవహారం చేసిందని ఆయన ఆరోపించారు.