న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా 32 ఏళ్ల మహిళ కడుపు నుంచి నాలుగు కిలోల భారీ మెసెంటెరిక్ కణితిని విజయవంతంగా తొలగించినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు 21 మంది మరణించారని, చాలా మంది గాయపడ్డారని ప్రభుత్వ మీడియా నివేదించింది.
జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరి నేతల మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
యూకే ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అభినందించారు. ఆమె నాయకత్వంలో భారత్-యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ అభినందన సందేశంలో పేర్కొన్నారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. ఆ పార్టీ నేతలు అతిషి, దుర్గేష్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్, జాస్మిన్ షాలకు నోటీసులు పంపారు.
తనను తప్పుడు ఎక్సైజ్ కేసులో ఇరికించాలని ఒత్తిడి తెచ్చినందుకే సీబీఐ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరచాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును చిత్రదుర్గ సెషన్స్ కోర్టు సోమవారం సెప్టెంబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ కన్జర్వేటివ్ నాయకత్వ రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ను ఓడించారు. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఆరు వారాలుగా హోరాహోరీ ప్రచారంతో పాటు పోలింగ్ కూడా పూర్తయింది.
త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీతో అమీతుమీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే ఆప్ నుంచి ఎదురవుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని గుజరాత్‌లో హామీల వర్షం గుప్పించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో గుజరాత్ పలు హామీలను గుప్పించారు.
దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగగా పేరుపొందాడు ఓ ఆటో డ్రైవర్. దొంగతనాలే కాకుండా హత్యలు కూడా చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 5 వేలకు పైగా కార్లను దొంగిలించిన నిందితుడు "దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగ" అనిల్ చౌహాన్‌ను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు.