ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డును తిరస్కరించారు సీపీఎం మహిళా నేత. కేరళ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, సీపీఎం సీనియర్ నేత కేకే శైలజకు రామన్ మెగసెసే అవార్డు ప్రకటించగా.. ఆమె తిరస్కరించారు.
ఉత్తరప్రదేశ్ మెయిన్‌పురి సమీపంలోని కొత్వాలి ప్రాంతంలో జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో అపశృతి జరిగింది. ఓ గణేశ్ మండపంలో నిర్వహించిన భజనలో హనుమంతుడు వేషం వేసిన కళాకారుడు డ్యాన్స్ చేస్తూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందారు. ముంబైలో రోడ్డుప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై సూర్య నది చరోటి వంతెనపై ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు నెరవేరడం లేదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి కేసీఆర్ కుటుంబసభ్యులకు మాత్రమే పరిమితమైందని ఆరోపించారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్వేషాలు పెరిగిపోతున్నాయని, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెగా ర్యాలీ వేదికపై నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
గుజరాత్ పర్యటనలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భగవద్గీతలోని శ్లోకాన్ని తప్పుగా పలికిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించిన కేజ్రీవాల్ ఈ సూచన చేశారు.
జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ ఎయిర్‌పోర్టులో సూర్యాస్తమయం తర్వాత నిబంధనలకు విరుద్ధంగా తమ చార్టెడ్ ఫ్లెట్‌ను టేకాఫ్‌కు అనుమతి ఇవ్వమని అధికారులను బలవంతం చేశారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే, మనోజ్ తివారీలతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కని, పెంచి, పెద్దచేసిన తల్లిని... కర్కశంగా ప్రాణాలు తీశాడో కుమారుడు. నవమాసాలు మోసి సాధిన కొడుకే తన పాలిట యముడవుతాడని ఆ తల్లి ఊహించలేకపోయింది. ఓ కసాయి కొడుకు మేక కోసం కన్నతల్లినే కడతేర్చాడు.