Ragi Breakfast Recipes: బరువు తగ్గడానికి రాగులతో చేసే 7 ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Breakfast Recipes: ఈ ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఆరోగ్యంపై శ్రద్ధపై వహించకపోతే అనారోగ్యం పాలు కావాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలు వేధిస్తున్న తరుణంలో మన పూర్వీకులు వారి ఆహారంలో భాగం చేసుకున్న ‘సిరిధాన్యాలు’ మళ్లీ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. అందులోనూ ‘రాగులు’ (చిరుధాన్యాల రారాజు) పోషకాల గని. మరి వారమంతా బోర్ కొట్టకుండా, రాగులతోనే అదిరిపోయే ఏడు రకాల అల్పాహారాలు ఎలా చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం!
READ ALSO: IND vs PAK: పాకిస్తాన్ పై ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్.. యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్
Also Read
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- 8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
1. మృదువైన రాగి ఇడ్లీ & క్రిస్పీ దోశ
రాగులు, మినప్పప్పు, అటుకులను నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీనివల్ల ఇడ్లీలు దూదిలా మృదువుగా వస్తాయి. అదే పిండితో మరుసటి రోజున పల్చగా దోశలు వేసుకుంటే హోటల్ స్టైల్‌లో క్రిస్పీగా ఉంటాయి. రాగులు అందుబాటులో లేని వారు రాగి పిండితో కూడా సింపుల్‌గా ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు.
2. రాగి రొట్టె..
రాగి పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర కలిపి తడి క్లాత్‌పై రొట్టెలా ఒత్తుకోవాలి. పెనంపై నెయ్యితో కాల్చుకుంటే వచ్చే ఆ రుచి వర్ణనాతీతం. ఇందులో మునగాకు లేదా క్యారెట్ తురుము కలిపితే పోషకాలు రెట్టింపు అవుతాయి.
3. తియ్యని రాగి పాన్ కేక్స్
పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ పాన్ కేక్స్‌ను రాగి పిండి, అరటిపండు, బెల్లం మిశ్రమంతో తయారు చేస్తారు. వీటిలో అటుకులు కలపడం వల్ల ఎంతో సాఫ్ట్‌గా ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌గానే కాకుండా సాయంత్రం స్నాక్స్‌లా కూడా ఇవి అద్భుతంగా పని చేస్తాయి.
4. ఇన్‌స్టంట్ రాగి రవ్వ దోశ
తక్షణమే అల్పాహారం కావాలనుకునే వారికి ఇది వరం. రాగి పిండిలో బొంబాయి రవ్వ, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు కలిపి పల్చగా రవ్వ దోశలా వేసుకోవచ్చు. హోటల్‌లో దొరికే రవ్వ దోశ కంటే ఇది ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.
5. రాగి డ్రై ఫ్రూట్ మాల్ట్
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, వివిధ రకాల విత్తనాలతో (Seeds) కలిపి తయారు చేసే ఈ డ్రింక్ రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. తాటి బెల్లం కలిపి తీసుకుంటే బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక సంపూర్ణ ఆహారంగా పని చేస్తుందని చెబుతున్నారు.
6. రాగి ఆవిరి కుడుము
రాగులు, మినప్పప్పు కలిపి రుబ్బిన పిండిని ఆవిరిపై ఉడికించి తయారు చేసే ఈ కుడుములు సులభంగా జీర్ణమవుతాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా నిశ్చింతగా వీటిని భుజించవచ్చు.
7. రాగి పిండితో మెత్తని ఇడ్లీలు
రాగులు నానబెట్టే సమయం లేనప్పుడు.. నేరుగా రాగి పిండిని మినప్పిండిలో కలిపి కూడా ఇడ్లీలు సిద్ధం చేసుకోవచ్చు. ఇవి కూడా అంతే రుచిగా ఉండటమే కాకుండా సమయాన్ని ఆదా చేస్తాయి.
“ఆరోగ్యమే మహాభాగ్యం” అన్న సూక్తిని పాటిస్తూ.. వారానికి సరిపడా ఈ ఏడు రకాల రాగి వంటకాలను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇవి కేవలం రుచిని మాత్రమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవనానికి విశేషంగా ఉపయోగపడుతాయని అంటున్నారు. మీ ఇంట్లో కూడా కుదిరినప్పుడు ట్రై చేసి చూడండి.
READ ALSO: China: కెనడా, బ్రిటన్‌లకు చైనా ‘వీసా’ గిఫ్ట్.. ‘ఫైవ్ ఐస్’ కూటమిలో మిగిలింది అమెరికా మాత్రమే!
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!