తమిళనాడులోని చెన్నైలో ఇద్దరు యువతులు ప్రేమించుకోవడమే కాకుండా సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులే బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో వారి వివాహాన్ని ఘనంగా జరిపించడం గమనార్హం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను నియమించింది. లెజెండరీ బ్యాట్స్‌మన్ టామ్ మూడీ స్థానంలో బ్రియాన్ లారాను ప్రధాని కోచ్‌గా నియమించినట్లు ఎస్‌ఆర్‌హెచ్ అధికారికంగా ధ్రువీకరించింది.
బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హర్యానాలోని హిసార్ జిల్లాలోని సంత్‌నగర్ ప్రాంతంలో గల దివంగత నటిసోనాలి ఫోగాట్ నివాసంలో గోవా పోలీసులు వరుసగా మూడో రోజు తనిఖీలు చేశారు.
ప్రముఖ సీనియర్ నటి సురేఖావాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా ఇలా గుర్తుండిపోయే పాత్రల్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు సురేఖావాణి.
సుకేష్ చంద్రశేఖర్ కేసుకు సంబంధించి నటి నోరా ఫతేహిని ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం శుక్రవారం ప్రశ్నించింది. నోరా ఫతేహిని 50 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ నుంచి గోవాకు వలస కార్మికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కొద్ది రోజులుగా తగ్గుతున్న కొవిడ్ కేసులు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా 7,219 కేసులు నమోదు అయ్యాయి.
చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపేందుకు నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం ఇవాళ జరగనుంది. నేడు మధ్యాహ్నం 2.17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నట్లు నాసా ప్రకటించింది.
అఫ్గానిస్థాన్ మరోసారి బాంబుదాడులతో హోరెత్తింది. పశ్చిమ అఫ్గానిస్థాన్‌లోని హెరాత్ పట్టణంలో ఓ మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 18 మంది మృతి చెందగా.. 23 మంది గాయపడ్డారు.