Basant Soren: లో దుస్తులు కొనేందుకు ఢిల్లీకి వెళ్లా.. ముఖ్యమంత్రి సోదరుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basant Soren: జార్ఖండ్‌లో ఇప్పటికే తీవ్ర రాజకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొట్టుమిట్టాడుతుండగా.. ప్రస్తుతం అతని తమ్ముడి వల్ల మరో సమస్య మెడకు చుట్టుకుంది. ముఖ్యమంత్రి సోదరుడు, దుమ్కా నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బసంత్ సోరెన్ తన నోటి దురుసు వల్ల వార్తల్లో నిలిచారు. దుమ్కా జిల్లాలో ఇటీవలి కాలంలో ఘోరాలు పెరిగిపోయాయి. అయితే ఈ ఘటనలు జరిగిన సమయంలో నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా ఎక్కడికి వెళ్లారని మీడియా ఆయనను ప్రశ్నించింది. దీనిపై మండిపడిన బసంత్ సోరెన్ విలేకరులపై నోరుపారేసుకున్నారు. లో దుస్తులు కొనేందుకు ఢిల్లీ వెళ్లానని వ్యాఖ్యానించారు.
దుమ్కాలో ఇటీవలే 19 ఏళ్ల యువతిపై అదే ప్రాంతానికి చెందిన షారూక్ అనే యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో కిటికీ బయట నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం వెలుగులోకి రావడంతో దుమ్కాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు దుమ్కాలో 144 సెక్షన్ విధించారు.
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
దుమ్కా జిల్లాలో మరో దారుణం జరిగింది. 14 ఏళ్ల తన కుమార్తెపై అత్యాచారం చేసి ఆపై హత్యచేసి చెట్టుకు వేలాడదీశారని బాధిత బాలిక తల్లి ఆరోపించింది. నిందితుడు అర్మాన్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణ రంగ కార్మికుడు అయిన నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దుమ్కా జిల్లాలో జరిగిన వరుస ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తగలబడిపోతున్నా ఎమ్మెల్యే బసంత్ సొరేన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ఘటన జరిగిన వారం తర్వాత బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో మీడియా ప్రతినిధులపై బసంత్ సొరేన్ అహంకారం ప్రదర్శించారు. ఓట్లు కావాల్సిన సమయంలోనే దర్శనమిచ్చే ప్రజాప్రతినిధులు అదే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం కనిపించరు. దీనిపై ప్రశ్నిస్తే అహంకారం ప్రదర్శిస్తుంటారు. రానున్న ఎన్నికల్లో ఇలాంటి నేతలందరికీ ప్రజలు గుణపాఠం చెబుతారని ప్రతిపక్షాలంటున్నాయి.
బసంత్ సోరెన్ దుమ్కా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరు బాలికలపై అత్యాచారం, హత్య తర్వాత ఆ నియోజకవర్గం గొడవలతో ఉడుకుతోంది. ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన సోరెన్ బాలికల కుటుంబాలను కలిశారు. తన ఢిల్లీ పర్యటనకు గల కారణాన్ని మీడియాతో అడిగితే.. ‘లోదుస్తులు అయిపోయాయి’ అని చెప్పారు.”నాకు లోదుస్తులు అయిపోయాయి, వాటిని కొనడానికి నేను ఢిల్లీ వెళ్ళాను, నేను వాటిని అక్కడ నుంచి తెచ్చుకుంటాను,” అతను నవ్వుతూ చెప్పాడు.
Family Planning Operation: మరో మహిళను బలి తీసుకున్న కు. ని. ఆపరేషన్
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యేపై విరుచుకుపడుతూ.. ‘పేదలు, గిరిజనుల నాయకుడైన శిబు సోరెన్ కుమారుడు లోదుస్తులు కొనేందుకు ఢిల్లీ వెళ్లాడు’ అని హిందీలో ట్వీట్ చేశారు. అందుకే ఎమ్మెల్యే బాధిత కుటుంబాలను పరామర్శించలేకపోయారని ఓ బీజేపీ ఎంపీ అన్నారు. మరికొందరు సోషల్ మీడియాలో విచిత్రమైన వ్యాఖ్యలతో మండిపడ్డారు.
జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి సోరెన్ తన పదవిలో ఉండగా.. తనకు మైనింగ్ లీజు మంజూరు చేసినందుకు అనర్హత వేటు పడే అవకాశం ఉన్నందున రాజకీయ అశాంతి నెలకొంది. హేమంత్ సోరెన్ అసెంబ్లీలో బలపరీక్షలో విజయం సాధించి, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఇప్పటికీ ఉందని నిరూపించుకున్నారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించేందుకే ఎన్నికల సంఘం సిఫార్సులపై చర్య తీసుకోవడంలో గవర్నర్ రమేష్ బయాస్ జాప్యం చేస్తున్నారని సోరెన్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!