Bangladesh PM Dance: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురువారం రాజస్థాన్‌లో ఆమెకు స్వాగతం పలికేందుకు జైపూర్ విమానాశ్రయానికి తరలివచ్చిన స్థానిక కళాకారులతో ముచ్చటించారు. రాజస్థానీ కళాకారులతో కలిసి నృత్యం చేశారు. ఆ సమయంలో ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ డీబోర్డింగ్ చేసిన తర్వాత, అక్కడ ఉన్న అధికారులకు ఆమె అభివాదం చేసి, కళాకారులు డ్రమ్ బీట్‌లకు డ్యాన్స్ చేస్తూ వారితో చేరారు. రంగురంగుల సాంప్రదాయ దుస్తులు ధరించిన కళాకారులతో ఆమె ఫోటో కూడా దిగారు.
సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించేందుకు ఆమె అజ్మీర్‌కు వెళ్లేందుకు అంతకుముందు రోజు జైపూర్ చేరుకున్నారు. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి బీడీ కల్లా, ఇతర ఉన్నతాధికారులు ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో కాసేపు వేచి ఉన్న తర్వాత ప్రధాని హసీనా ప్రతినిధి బృందం రోడ్డు మార్గంలో అజ్మీర్‌కు బయలుదేరింది. దర్గాలో ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇతర భక్తులను దర్గా ఆవరణలోకి అనుమతించలేదు. ఒక దేశానికి చెందిన అధిపతి సందర్శన సమయంలో అనుసరించిన ప్రోటోకాల్‌ల ప్రకారం మందిరం మార్కెట్ మూసివేయబడింది. దర్గా వద్ద ఆమెకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. నాలుగు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన హసీనా ఈరోజు అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించారు.
ద్వైపాక్షిక సంబంధాలలో ఊపందుకోవడం కోసం సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నందున, మంగళవారం ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ద్వైపాక్షిక సమస్యలపై విస్తృతంగా చర్చించారు. హసీనా పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఏడు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు)పై సంతకాలు చేశాయి. హైదరాబాద్ హౌస్‌లో ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య అంతర్-ప్రభుత్వ రైల్వే సహకారాన్ని మరింతగా పెంపొందించేందుకు భారత్, బంగ్లాదేశ్ మధ్య మంగళవారం రెండు అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
Venkaiah Naidu: అప్పుడు చాలా బాధపడ్డా.. వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు..
1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారతదేశ మద్దతును ప్రశంసిస్తూ.. ప్రధాన మంత్రి షేక్ హసీనా బుధవారం భారత్‌తో తన దేశ సంబంధాలను పునరుద్ఘాటించారు. ఈ సంబంధం వ్యూహాత్మక భాగస్వామ్యానికి మించినదని.. గత దశాబ్దంలో బలపడిందని అన్నారు.1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన లేదా తీవ్రంగా గాయపడిన 200 మంది భారత రక్షణ దళాల సిబ్బందికి వారసులకు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన బంగాబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ విద్యార్థి స్కాలర్‌షిప్‌ను అందించారు. న్యూఢిల్లీలో జరిగిన ఆ కార్యక్రమంలో హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Rajasthan: Upon her arrival at Jaipur airport earlier today, Bangladesh PM Sheikh Hasina grooved with the local artists who had gathered there to welcome her. pic.twitter.com/Mk8qf5xDEG
— ANI (@ANI) September 8, 2022