Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాదం కారణంగా బస్సులో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దిండిగల్ జిల్లాలో బైక్‌ను ఢీకొట్టింది బస్సు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు అగ్నికీలల్లో చిక్కుకుంది. అలర్ట్ అయిన ప్రయాణీకులు బస్సులో నుంచి దూకి పరుగులు తీశారు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
సమాచారం అందుకుని అగ్నిమాపక వాహనం చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్ధం అయింది. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.