Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానం శనివారం అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడిందని స్థానిక మీడియా తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ శనివారం ఒక ర్యాలీలో ప్రసంగించేందుకు ప్రత్యేక విమానంలో గుజ్రాన్‌వాలాకు వెళ్తున్నారని డైలీ పాకిస్థాన్ వెల్లడించింది. పైలట్ కంట్రోల్ టవర్‌ను సంప్రదించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయచేశాడు. అత్యవసర ల్యాండింగ్ తర్వాత ఇమ్రాన్‌ఖాన్ రోడ్డు మార్గంలో గుజ్రాన్‌వాలాకు వెళ్లినట్లు సమాచారం.
ప్రతికూల వాతావరణం కారణంగా ఖాన్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇస్లామాబాద్‌కు తిరిగి వచ్చిందని డైలీ పాకిస్తాన్ నివేదించింది. విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నట్లు వస్తున్న వార్తలు తప్పు అంటూ పీటీఐ నాయకుడు ట్వీట్ చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఆయన రోడ్డు మార్గంలో వెళ్లినట్లు తెలుస్తోంది.
Woman Stuck In Gym: జిమ్‌లో మహిళకు వింత ఘనట.. తలక్రిందులుగా..
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ఛైర్మన్ తనకు సంఘీభావం తెలిపేందుకు శనివారం దేశంలోని వివిధ ప్రాంతాలలో ర్యాలీ చేపట్టాలని కార్మికులు, ప్రజలకు పిలుపునిచ్చారు. గుజ్రాన్‌వాలాలో జరిగిన ర్యాలీలో ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగించారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా దేశాన్ని బ్రిటిష్ వారి బానిసత్వం నుండి విముక్తి చేశాడని.. అయితే దేశం ఇప్పుడు భిన్నమైన బానిసత్వంతో బాధపడుతోందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా పతనమైతే దానికి ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
మహిళా న్యాయమూర్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఇమ్రాన్ ఖాన్ కోర్టు ధిక్కార అభియోగాలను ఎదుర్కొంటున్నారు.