JEE Advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE Advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్ల భర్తీకి గత నెల 28వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్–2022 ఫలితాలను పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై ఆదివారం ప్రకటించింది. ఫలితాలతో పాటే తుది ఆన్సర్ కీ, మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయకు 6వ ర్యాంకు వచ్చింది. అభ్యర్థులు స్కోర్ కార్డులను jeeadv.ac.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను రిజర్వేషన్లవారీగా ఆయా వర్గాల కోటా ప్రకారం విడుదల చేశారు.
Mahindra XUV400 EV: మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ ధర, రేంజ్, ఫీచర్లు ఇవే..
Also Read
- Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఈ నెల 12 నుంచి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. దేశంలోని 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. వీటిలో బాలికలకు 1,567 సీట్లను సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తారు. ఐఐటీల్లో అత్యధికంగా 2,129 మెకానికల్ ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో ఇవి సుమారు 13 శాతం. ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ సీట్లనూ కలిపితే అది 14 శాతానికి పెరుగుతుంది. ఆర్కిటెక్చర్ కోర్సులకు సంబంధించిన అభ్యర్థులు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు 11, 12 తేదీల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14న ఏఏటీ పరీక్షను నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఫలితాల కోసం: క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!