విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో సమావేశమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి రాతపూర్వక సందేశాన్ని అందజేశారు. దీంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఆయనకు వివరించారు.
ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఏర్పాటైన మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లా ప్రారంభోత్సవంతో మనేంద్రగఢ్ నివాసి రామశంకర్ గుప్తా సంకల్పం కూడా నెరవేరింది. ఆ సంకల్పం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 చివరియాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్‌లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు.
ఇప్పటికే మద్యం విధానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ సర్కారుకు లోఫ్లోర్ బస్సుల వ్యవహారం రూపంలో మరో చిక్కు వచ్చి పడింది. ఢిల్లీలో 1,000 లో–ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు.
జ్ఞానవాపి మసీదు- శృంగర్ గౌరీ కేసులో దాఖలైన వ్యాజ్యంపై వారణాసి జిల్లా కోర్టు సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. మతపరమైన సున్నితమైన అంశంలో జిల్లా న్యాయమూర్తి ఏకే విశ్వేష్ గత నెలలో ఉత్తర్వులను సెప్టెంబర్ 12 వరకు రిజర్వ్ చేశారు.