Corona Cases In India: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 5,664 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కరోనా మహమ్మారి బారిన పడి 35 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.11 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 47 వేల పైకి చేరుకుంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 47,922కు చేరాయి.
దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 4,45,34,188కి చేరుకుంది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,28,337గా ఉంది. ఇండియాలో 4,39,57,929 మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా ఉంది. దేశంలో శనివారం 14,84,216 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 216.56 కోట్లకు చేరింది. ఒక్కరోజే 2,89,228 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. భారతదేశంలో కొవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి చూస్తే.. డిసెంబర్, 2020లో కోటి కేసులు నమోదు అవ్వగా.. ఈ సంఖ్య మే 4,2021 నాటికి రెండు కోట్లకు, జూన్ 23,2021 నాటికి మూడు కోట్లకు.. జవవరి 25, 2022 నాటికి నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది.
Mohammed Shami: భారత పేసర్ మహ్మద్ షమీకి కొవిడ్.. ఆస్ట్రేలియాతో టీ-20 సిరీస్‌కు దూరం
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో కొవిడ్ వ్యాధి విజృంభిస్తోంది. కొత్తగా 3,38,128 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 774 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,68,56,201కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,30,060 మంది మరణించారు. మరో 5,94,451 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,62,84,233కు చేరింది. జపాన్‌లో కొత్తగా 77,804 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 186 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియాలో కొత్తగా 43,400 కేసులు వెలుగుచూశాయి. మరో 57 మంది మరణించారు.రష్యాలో 58,305 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 107 మంది మృతి చెందారు. తైవాన్‌లో 39,628 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోయారు.