Mohammed Shami: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్న టీమిండియా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీకి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 20 నుంచి మొహాలీలో ప్రారంభం కానున్న టీ-20 సిరీస్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఈ సిరీస్‌కు షమీ దూరంగా ఉండనున్నాడు. షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ ఆడనున్నాడు.
మహ్మద్ షమీ.. జూలై 2022 నుంచి మైదానంలో కనిపించలేదు. అతను నవంబర్ 2021 నుంచి ఇంటర్నేషనల్ టీ-20 మ్యాచ్ ఒక్కటి కూడా ఆడలేదు. ఏది ఏమైనప్పటికీ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో తక్కువ మ్యాచ్‌లే ఆడినప్పటికీ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో అతని ప్రదర్శన ఆధారంగా ఆసిస్‌తో సిరీస్‌కు అతడిని జట్టులోకి ఎంపిక చేశారు. ఈ 32 ఏండ్ల పేసర్ ఐపీఎల్‌లో అరంగేట్రంలోని అదరగొట్టిన గుజరాత్ టైటన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గత ఐపీఎల్‌ను గుజరాత్ జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ 20 వరల్డ్ కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు కూడా షమీ ఎంపికయ్యాడు. అయితే అతడిని స్టాండ్‌బై ప్లేయర్‌గా జట్టులోకి తీసుకున్నారు. అంటే ఒక బౌలర్ గాయపడితే, షమీని ప్రధాన జట్టులోకి తీసుకుంటారు.
సెప్టెంబరు 20, 23, 25 తేదీల్లో ఆస్ట్రేలియాతో.. సెప్టెంబర్ 28, అక్టోబర్ 2, అక్టోబర్ 4 తేదీల్లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లు వచ్చే నెలలో జరిగే ప్రపంచ కప్‌కు ముందు భారత్ ఆడే టీ-20 సిరీస్‌లు. ఈ సిరీస్‌లు భారత్ ప్రపంచకప్‌లో మెరుగ్గా ఆడేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. క్రికెట్‌కు రెండు నెలల విరామం ఇచ్చిన షమీ ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి వారు జట్టులో అవకాశం కల్పించారు. ఈ మ్యాచ్‌లు ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ కోసం గేమ్ ప్రాక్టీస్‌గా ఉపయోగపడతాయి. ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. సూపర్ 12 ఫేజ్‌లో పోటీ నుంచి నిష్క్రమించడంతో గత ఏడాది భారత్ సెమీస్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది.
Copper Ring: రాగి ఉంగరం ధరిస్తే ఏమౌతుందో తెలుసా?
ఆస్ట్రేలియా టీ20లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్. షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా