President Murmu: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనడానికి, భారత ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేయడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం సాయంత్రం లండన్ చేరుకున్నారు. సెప్టెంబరు 8న స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లోని తన వేసవి నివాసంలో క్వీన్ ఎలిజబెత్-2 ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 ఉదయం వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత్ తరపున రాష్ట్రపతి లండన్‌కు వెళ్లారు. భారత రాష్ట్రపతి ముర్ము మూడు రోజుల పాటు యూకే పర్యటనలో ఉన్నారు. ఆమె సోమవారం అంత్యక్రియల్లో పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం కింగ్ చార్లెస్-3 బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ప్రపంచ నాయకులకు ఆతిథ్యమిచ్చే రిసెప్షన్‌కు కూడా ఆహ్వానించబడ్డారు.
Tamilnadu: నాకు 5 యావజ్జీవ శిక్షలు విధించండి యువరానర్.. కోర్టులో హత్యకేసు దోషి కేకలు
భారతదేశం జాతీయ సంతాప దినాన్ని పాటించిన మరుసటి రోజు సెప్టెంబర్ 12న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ న్యూఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్‌ను సందర్శించి దేశ సంతాపాన్ని తెలియజేశారు. భారత ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేయడానికి రాష్ట్రపతి లండన్‌కు వెళతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈ వారం ప్రారంభంలో ధ్రువీకరించింది.