Komatireddy Rajagopal Reddy: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నేతల సభలకు డబ్బులిచ్చి జనాలను తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్.. ఏం ఘనకార్యం చేశావని దేశ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నావ్ అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్న ఆయన.. బీజేపీ తరపున మరో “ఆర్” గెలవడం ఖాయమని.. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఫామ్ హౌజ్ నుంచి బయటకు రాని కేసీఆర్.. బయటకు వచ్చి మునుగోడులో సభ పెట్టిండు అంటూ ఎద్దేవా చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు.
బీజేపీ అంటే.. టీఆర్‌ఎస్ లాగా లక్షల కోట్లు దోచుకున్న పార్టీ కాదని ఆయన ఆరోపించారు. మునుగోడు ఎన్నికలపై కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్ అటో.. ఇటో.. అభ్యర్థి పేరును ప్రకటించినా.. అదే కేసీఆర్ కు కనీసం అభ్యర్థి కూడా దొరకడం లేదని… అందుకే పేరు ప్రకటించడం లేదన్నారు. కేసీఆర్ సభలు జనం లేక వెలవెలబోతున్నాయన్నారు. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లు దండుకున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చిన ఉప ఎన్నిక కాదన్న ఆయన.. ప్రజల సంక్షేమం కోసం, భవిష్యత్ కోసం వచ్చిన ఉప ఎన్నిక అని చెప్పుకొచ్చారు. మచ్చలేని నాయకుడు మోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడులో జరిగేది ఎన్నిక కాదని.. అది ఒక ధర్మ యుద్ధమన్నారు.
Etela Rajender: కేసీఆర్ అబద్ధాల గురించి ఎన్ని చెప్పినా తక్కువే..
మునుగోడు ఉప ఎన్నికలో ధర్మాన్ని కాపాడి, ప్రజాస్వామ్యాన్ని బతికించాలన్నారు. కేసీఆర్‌కు భయంతో నిద్ర పట్టడం లేదన్నారు. బండి సంజయ్ పాదయాత్రగా ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన అన్నారు.