Captain Miller: పూజతో మొదలైన ధనుష్ కొత్త సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Captain Miller: నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ భారీ పిరియాడికల్ మూవీ 1930-40 నేపథ్యంలో అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి జి త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో థనుష్ సరసన నాయికలుగా ప్రియాంక మోహన్, నివేదిత సతీశ్ ను ఎంపిక చేసినట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. అలానే సందీప్ కిషన్ సైతం ఇందులో ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
Naga Shaurya: నాకు కాబోయే భార్య తెలుగమ్మాయే.. పెళ్లి వార్త చెప్పిన కుర్ర హీరో
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ధనుష్‌కు ఇది స్పెషల్ ఇయర్!
తమిళ స్టార్ హీరో ధనుష్ కెరీర్ లో ఇది స్పెషల్ ఇయర్ గా మిగిలిపోనుంది. గత కొంతకాలంగా ధనుష్ యేడాదికి రెండు లేదా మూడు సినిమాలలో చేస్తున్నాడు. దానికి అదనంగా ఒకటో రెండో సినిమాలలో అతిథి పాత్రలు పోషిస్తున్నాడు. కానీ ఈ యేడాది ధనుష్ నటించిన అత్యధిక చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ‘మారన్’, ‘ది గ్రే మ్యాన్’ చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఇందులో ‘ది గ్రే మ్యాన్’ హాలీవుడ్ మూవీ. ఇందులో ధనుష్ కనిపించేది కాసేపే అయినా అది కీలక పాత్ర కావడం విశేషం. అలానే దీనికి సీక్వెల్ గా రాబోతున్న మూవీలోనూ ధనుష్ నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటన వచ్చింది. అలానే ఈ యేడాది ధనుష్ నటించిన ‘తిరుచిత్రాంబలమ్’ విడుదలైంది. ఇక ధనుష్ అన్న సెల్వరాఘవన్ డైరెక్ట్ చేసిన ‘నానే వరువేన్’ ఈ నెల 29న రాబోతోంది. ఈ యేడాది చివరిలో అంటే డిసెంబర్ 2న ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘సర్’ తెలుగు, తమిళ భాషల్లో జనం ముందుకు వస్తోంది. అంటే ధనుష్ నటించిన ఐదు సినిమాలు ఈ యేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయని అనుకోవాలి.


తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!