ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఓ రిసార్టులో అంకితా బండారీ అనే 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ హత్య ప్రకంపనలు రేపుతోంది. రిసార్టు యజమానే మరో ఇద్దరితో కలిసి రిసెప్షనిస్టును హత్య చేసినట్లు తేలింది. రిసార్టు యజమాని రాష్ట్ర బీజేపీ నేత కొడుకు కావడంతో ఈ ఘటన దేశమంతటా సంచలనంగా మారింది.
రష్యాలోని గబ్బిలాలలో మరో వైరస్ 'ఖోస్టా-2'ను పరిశోధకులు కనుగొన్నారు, ఇది మానవులకు సోకుతుందని చెప్పారు. టైమ్ మ్యాగజైన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. మానవ జనాభాకు సమస్యలను కలిగించే వైరస్‌ను పరిశోధకులు రష్యన్ గబ్బిలాలలో కనుగొన్నారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దాడులను నిరసిస్తూ శుక్రవారం కేరళలో చేపట్టిన ధర్నా హింసాత్మకంగా మారింది. ఈ దాడులకు వ్యతిరేకంగా పీఎఫ్‌ఐ కార్యకర్తలు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేపట్టారు.
మరో ఆరు నుంచి పది నెలల్లో పార్లమెంట్ ముందుకు నూతన టెలికాం బిల్లు రానుంది. ప్రజాభిప్రాయం కోసం డ్రాఫ్ట్ బిల్లును కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విడుదల చేశారు.
Dussehra Rally: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేనేతృత్వంలోని శివసేనకు బాంబే హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ముంబైలోని ప్రముఖ శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీని నిర్వహించేందుకు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే వర్గానికి ఈరోజు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి దావాపై వివాదం పరిష్కారమయ్యే వరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవద్దని షిండే వర్గం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ముంబై పోలీసులు లేవనెత్తిన శాంతిభద్రతల ఆందోళనల […]
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ ఎం శ్రీనివాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ శుక్రవారం నియమించింది.
ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే అంకితా భండారీ హత్యకు గురైంది. ఆమెను కొండ పైనుంచి నదిలోకి తోసేశారు.