Bill Gates-AP: గన్నవరం చేరుకున్న బిల్‌గేట్స్.. ఏపీ నేతలతో కీలక భేటీ!
- గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న బిల్‌గేట్స్
- బిల్‌గేట్స్‌కు ఘన స్వాగతం పలికిన నారా లోకేష్
- ఎయిర్‌పోర్ట్ నుంచి సచివాలయం బయల్దేరిన బిల్‌గేట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్ ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్‌కు ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమస్య ఎదురైంది. పొగమంచు కారణంగా ల్యాండింగ్‌కు అంతరాయం కలిగింది. దీంతో ఫ్లైట్ కాసేపు విజయవాడ చుట్టూ గాల్లో చక్కర్లు కొట్టింది. పైలట్‌కు రన్‌వే సరిగా కనిపించకపోవడంతో విమానాన్ని దింపడం సాధ్యపడలేదు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడ్డాక ఫ్లైట్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైంది.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న గేట్స్‌కు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, సత్య కుమార్ యాదవ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అధికారుల బృందం కూడా ఆతిథ్యం అందించింది. అనంతరం గేట్స్ బృందం గన్నవరం నుంచి రాష్ట్ర సచివాలయానికి బయలుదేరింది. ఈరోజు ఉదయం 9:30 గంటలకు గేట్స్ సచివాలయానికి చేరుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) సాంకేతికత, వ్యవసాయ రంగంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం, డేటా ఆధారిత పాలన వంటి అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన చర్చించనున్నారు.
Also Read
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన “స్వర్ణాంధ్ర విజన్”పై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని గేట్స్‌కు వివరించనున్నారు. ఈ భేటీ ద్వారా రాష్ట్రానికి గేట్స్ ఫౌండేషన్ సహకారం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. సచివాలయ సమావేశాల అనంతరం సీఎం నివాసంలో గేట్స్ బృందానికి విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత గేట్స్ ఢిల్లీకి బయలుదేరనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!