HCA President Azharuddin: ఈ నెల 25న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ టికెట్ల విక్రయంపై వివాదం నెలకొంది. ఈ వివాదంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ వివరణ ఇచ్చారు. క్రికెట్ అభివృద్ధి కోసమే మేమందరం కష్టపడుతున్నామని అన్నారు. ఈ నెల 25న భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే టీ20 మ్యాచ్ టికెట్లు అన్ని అమ్ముడు పోయాయని.. ఆన్‌లైన్‌లో అమ్మడానికి ఏమి లేవన్నారు.
Srinivas Goud: జింఖానా గ్రౌండ్‌లో జరిగిన ఘటనపై కమిటీ.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
జింఖానా గ్రౌండ్‌లో ఇవాళ జరిగిన ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ఇవాళ సికింద్రాబాద్ గ్రౌండ్ టికెట్ల అమ్మకంపై పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడూ నెగిటివ్ కోణంలో చూడొద్దన్న ఆయన.. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏమిచేయలేరన్నారు. తమవైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని అజారుద్దీన్ తెలిపారు. టికెట్ల గోల్‌మాల్‌ను లైట్‌గా తీసుకున్న అజారుద్దీన్.. ఇంత పెద్ద మ్యాచ్ నిర్వహించినప్పుడు చిన్నాచితక ఘటనలు జరుగుతాయన్నారు. తమకు మ్యాచ్ నిర్వహణే ముఖ్యమన్నారు. మంత్రితో సమావేశం నేపథ్యంలో అజారుద్దీన్ ఘాటుగా స్పందించారు. మ్యాచ్ నిర్వహణ తమకు ముఖ్యమని.. మీ దగ్గర కూర్చుని ముచ్చట్లు చెప్పడానికి తమకు టైమ్ లేదని అజార్ మంత్రికి చెప్పినట్లు సమాచారం. తాను వెళ్లి మ్యాచ్ నిర్వహణ చూసుకోవాలన్నారు. మ్యాచ్ నిర్వహణ అంటే ఇక్కడ కూర్చుని మాట్లాడినంత ఈజీ కాదని అన్నారు.