కెనడాలోని భారతీయ పౌరులను, ఆ దేశానికి వెళ్లే విద్యార్థులను జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కెనడాలో ఇటీవల భారతీయుల పట్ల నేరాలు పెరిగాయని.. విద్వేష దాడి ఘటనలు కూడా ఎక్కువయ్యాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష ఎన్నికలకు ఆయన నామినేషన్ వేస్తారనే ఊహాగానాల మధ్య, పార్టీ చీఫ్ రేసులో తాను లేనని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం తెలిపారు.
జరాత్‌లోని నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని రాజకీయ అండదండలతో "అర్బన్ నక్సల్స్, అభివృద్ధి నిరోధకులు" చాలా సంవత్సరాలుగా ఈ డ్యామ్ పర్యావరణానికి హాని కలిగిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తూ పనులను అడ్డుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
బిహార్‌లోని పూర్నియాలో జరిగిన మెగా ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బిహార్‌లో బీజేపీ సోలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పేరిట ఆయన సమర్థవంతంగా ప్రారంభించారు.
టికెట్లు దొరకకపోవడంతో పాటు తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటకు కారణం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే కారణమని గాయపడిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అజారుద్దీన్ సహా హెచ్‌సీఏ నిర్వాహకులపై మూడు కేసులు నమోదయ్యాయి.
గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంటపండింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో అద్భుత ప్రదర్శనతో దేశంలో అత్యుత్తమంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది
ఎంఎన్‌జే క్యాన్సప్ ఆస్పత్రిని మంత్రి హరీష్ రావు.. ఎంపీ విజయేంద్ర ప్రసాద్, డాక్టర్ శరత్‌తో కలిసి సందర్శించారు. ఆసుపత్రి పెండింగ్ పనులు, కొత్త బిల్డింగ్ నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు.
మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. కేసీఆర్ ఖేల్ కాబోతోందని...ఆయన దుకాణం బంద్ ఖాయమన్నారు. కేసీఆర్ తో లడాయికి సిద్ధమయ్యామని... ఎంఐఎతో కలిసి వచ్చినా బల ప్రదర్శనకు సిద్ధమని సవాల్ విసిరారు.
నీటిపారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ 3 లేఖలు రాశారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని లేఖలో పేర్కొన్నారు.