School Teacher: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి జీవితాలను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే వారితో నీచంగా ప్రవర్తించాడు. ఓ పాఠశాలలో బాలికలకు అశ్లీల వీడియో చూపించడంతో పాటు వారిని అనుచితంగా తాకుతూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ టీచర్. ఈ ఘటన జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో జరిగింది. బాలికలు తమ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పడంతో వారు ఆగ్రహంతో గ్రామస్థులతో కలిసి ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ముఖంపై నల్లని సిరా ఇంకు పూసి, బూట్లతో దండలు వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని రక్షించి ఔట్‌పోస్టుకు తరలించడంతో గ్రామస్తులు అతడిని వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని నోముండి బ్లాక్‌లో చదువుతున్న ఆరుగురు బాలికలు ఉపాధ్యాయుడు తమకు అసభ్యకరమైన వీడియోలు చూపించి, అనుచితంగా తాకినట్లు వారి తల్లిదండ్రులకు చెప్పారని పోలీసు అధికారి తెలిపారు. దీంతో గ్రామస్తులు నిందితులపై బుధవారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు సమావేశం నిర్వహించి శిక్షించాలని నిర్ణయించారు.పెద్ద సంఖ్యలో మహిళలు నిందితుడిని పట్టుకుని, గురువారం అతని ముఖంపై సిరా పూసి, బూట్లతో దండలు వేశారు. బడాజమ్డా ప్రాంతంలో ఊరేగించి సమీపంలోని రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్తుండగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని రక్షించారు. నిందితులను జైలుకు పంపాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పోలీసు అవుట్‌పోస్టు వెలుపల ధర్నాకు దిగారని పోలీసు అధికారి తెలిపారు. గంటల తరబడి ఆందోళన చేసిన మహిళలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (కిరిబూరు) వీరేంద్ర ఎక్కా శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.