Fire Accident: హైదరాబాద్‌లోని ఆరాంఘర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఉన్న ఓ స్క్రాపు షాపులో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. 2 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. పక్కన ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేసేందుకు ప్రయత్నిస్తు్న్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
KCR National Party: నేడు ప్రగతిభవన్‌లో కీలక భేటీ.. జాతీయ పార్టీపై చర్చించనున్న కేసీఆర్
మూడు గంటల నుంచి మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు కొనసాగుతుండగా.. ఈ స్క్రాపు దుకాణానికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు. జేసీబీ సహాయంతో ప్రహరి గోడ కూలగొట్టి మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ప్లాస్టిక్ పూర్తిగా కాలి పోవడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. ఘాటైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.