Revanth Reddy: ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునే నెల్సన్ మండేలా లాంటి నాయకులకు గాంధీ స్ఫూర్తి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచానికి గాంధీయిజాన్ని పరిచయం చేసిన గొప్ప మహనీయుడన్నారు. గొప్ప సిద్ధాంతం గాంధీయిజం చరిత్రలో నిలబడిందన్నారు. యుగ పురుషుడిగా గాంధీజీ మనకు గర్వకారణమన్నారు. వందల సంవత్సరాలు ఈ దేశంపై ఆధిపత్యం చలాయిస్తున్న బ్రిటిషర్లకు వ్యతిరేకంగా గుండెలనెదురొడ్డి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారన్నారు. వారి స్పూర్తితో కాంగ్రెస్ పార్టీ బాక్రానంగళ్ నుంచి నాగార్జున సాగర్ వరకు హరిత విప్లవానికి పునాది వేసింది జవహర్ లాల్ నెహ్రు ,లాల్ బహుదూర్ శాస్త్రిలు అంటూ కీర్తించారు.
ఇందిరాగాంధీ ,సోనియా, మన్మోహన్ నేతృత్వంలో అభివృద్ధికి కాంగ్రెస్ ఎన్నో చర్యలు చేపట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. బడుగు, బలహీన గిరిజన మైనార్టీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్సేనన్నారు. ప్రపంచంలో 10 మంది ఐటీ నిపుణుల్లో నలుగురు భారత్ వాళ్లేనని ఆయన చెప్పారు. ఐటీ నిపుణులను తయారు చేయడానికి కంప్యూటర్ పరిచయం చేసింది రాజీవ్ గాంధేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీజేపీ అనే విషవృక్షం దేశాన్ని పెకిలించాలని చూస్తుందని ఆయన విమర్శించారు. బ్రిటిష్ వాళ్లు అమలు చేసినట్టు విభజించు పాలించు నినాదాన్ని మోడీ ,కేసీఆర్‌లు అమలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ప్రజల మధ్య గోడలు నిర్మించేలా చేస్తున్నారన్నారు.
CM K.Chandrashekar Rao: మహాత్ముడి సిద్ధాంతం విశ్వజనీనం.. ప్రతి పలుకు ఆచరణాత్మకం
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ దేశాన్ని ఏకీకృతం చేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ముగిసిన పాదయాత్ర.. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోందన్నారు. అక్టోబర్ 24న తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర వస్తుందన్నారు. ఈ యాత్రలో రాజకీయ ధోరణి లేదని.. భారత్ జోడోయాత్ర ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర, క్విట్ ఇండియా ఎలా స్ఫూర్తిని నింపిందో ఇప్పుడు ఈ యాత్ర అలా నింపుతుందన్నారు.