Mahatma Gandhi Statue: గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అంతకు ముందు మహత్మాగాంధీ రోడ్డులోని బాపూజీ విగ్రహం వద్ద పలువురు మంత్రులతో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
CM K.Chandrashekar Rao : గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో తెలంగాణను సాధించుకున్నాం..
ధ్యానభంగిమలో కూర్చున్న మహాత్మగాంధీ కాంస్య విగ్రహాన్ని సర్కారు రూ.1.25కోట్లు గాంధీ ఆస్పత్రి ప్రవేశద్వారం ఎదుట ఏర్పాటు చేసింది. 16 అడుగుల ఎత్తుతో, 5టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రామ్ సుతార్ ఫైన్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో కలిసి హెచ్‌ఎండీఏ అధికారులు ఏర్పాటు చేశారు.