Workers Clash: నల్గొండలోని భాస్కర్ టాకీస్ కూలీల అడ్డా దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. పని విషయంలో స్థానిక, బిహార్ కూలీలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అదికాస్తా ముదిరి రాళ్లు విసురుకునే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కూలీల అడ్డా రణరంగంగా మారింది. బిహార్ కూలీలు రాళ్లు విసరడంతో స్థానిక కూలీలు తలోదిక్కుకు పారిపోయారు. రాళ్లదాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసుల ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.